Tuesday Haircut: హిందూ సంప్రదాయాల ప్రకారం చాలా ఆచారాలను ప్రజలు పాటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా అనుసరిస్తున్న ఆచారంలో ఒకటి మంగళవారం ఆచారం. మంగళవారం రోజున హెయిర్, గోర్లు కట్ చేసుకోకూడదని హిందువులు చెప్తుంటారు. ఈ రోజున హెయిర్ కటింగ్ లేదా గోర్లు కట్ చేసుకున్నట్లయితే చెడు జరుగుతుందని, ఆ విధమైన సంకేతాలు వస్తాయని అనుకుంటారు.
ఈ క్రమంలోనే మంగళవారం క్షౌరశాలలు కూడా మూసేసి ఉంటాయి. మంగళవారం రోజున ఏ బార్బర్ షాప్ కూడా తెరిచి ఉండదు. అన్ని క్లోజ్ అయ్యే ఉంటాయి. ఇక ఈ రోజున బార్బర్స్ హాలీ డే మాదిరిగా రెస్ట్ తీసుకుంటారు. అయితే, ఇలా మంగళవారం హెయిర్ కట్ చేసుకోకపోవడానికి గల బలమైన కారణాలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ కారణమేంటనేది తెలుసుకుందాం.
Also Read: మెంతి ఆకులతో ఆ వ్యాధులకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్.. ఎలా అంటే?
నిజానికి మంగళవారం అనగా.. మంగళవార్ అనగా మంగళ గ్రహం అని అర్థం. అనగా మంగళ్.. లేదా మార్స్ గ్రహం అని స్పష్టం. అలా అంగారక గ్రహానికి మానవ శరీరానికి సంబంధం ఉందని కొందరు వివరిస్తున్నారు. అంగారక గ్రహాన్ని అరుణ గ్రహం అని కూడా పిలుస్తారు. అనగా ఎరుపు వర్ణం.. రెండ్ కలర్‌కు సింబల్ అయిన అంగారక గ్రహం రోజున హెయిర్ లేదా గోర్లు కటింగ్ చేసుకున్నట్లయితే మానవ శరీరంపై ప్రభావం పడుతుంది. అలా బ్లడ్‌పై ఇంపాక్ట్ ఉంటుంది. హ్యూమన్ బాడీపైన గాట్లు లేదా గాయాలు అయ్యే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకు అని భావించి మంగళవారం రోజున కటింగ్ చేసుకోరు.
అరుణ లేదా అంగారక గ్రహ ప్రభావం డెఫినెట్‌గా మంగళవారం రోజున ఉంటుంది. కాబట్టి ఆ రోజున హెయిర్ కటింగ్ కాని షేవింగ్ కాని చేయించుకోకూడదని నమ్ముతారు ప్రజలు. అలా ప్రమాదకర పరిస్థితులలో చిక్కుకోకుండా ఉండేందుకుగాను మంగళవారం రోజున ఈ నియమ నిబంధనలు పాటిస్తారు ప్రజలు. అలా హిందూ సంప్రదాయాల ప్రకారం.. మంగళవారం చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున జుట్టు కాని గోర్లు కాని ప్రజలు కత్తిరించుకోరు.
Also Read: కోళ్లు పోయి పందులొచ్చే.. సంక్రాంతికి వరహాలు రెడీ అయ్యాయి..?