Expatriate Indians: విదేశాల నుంచి ఇకపై డబ్బులు సులభంగా అందుకోవచ్చు. దీనికి గాను సులభతర మార్గాలను అవలంభిస్తున్నారు. ఇందుకోసం పలు పద్ధతులను అందుబాటులోకి తెస్తోంది. లబ్ధిదారుల యూపీఐ ఐడీలను ఉపయోగించి నగదు బదిలీని సులభతరం చేస్తూ ఎన్ పీసీఐ ( నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) ఇండస్ ఇండ్ బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇకపై రెమిటెన్సులు వినియోగంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇండస్ ఇండ్ బ్యాంక్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

మనీ ట్రాన్స్ ఫర్ ఆపరేటర్లు (ఎంటీవో) ఎన్ పీసీఐ యూపీఐ చెల్లింపులను అనుసంధానం చేస్తూ చెల్లింపులు చేయడానికి ఉద్దేశించారు. ఇందులో భాగంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ చానెల్ ను వినియోగించుకోనున్నారు. థాయ్ లాండ్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ విధానాన్ని బ్యాంక్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. థాయ్ లాండ్ కేంద్రంగా ఫైనాన్సియల్ సేవల సంస్థ డీమనీ సేవలను అందుబాటులోకి తేనుంది. నగదు బదిలీ, విదేశీ కరెన్సీ మార్పిడికి సంబంధించి డీమనీ సేవలు చేస్తోంది.
Also Read: ప్రతిరోజూ రూ. 100 పెట్టుబడితో మిలియనీర్ అయ్యే ఛాన్స్.. ఎలా అంటే?
విదేశాల్లోని ప్రవాస భారతీయులు ఎవరైనా సులభంగా నిధులు బదిలీ చేసుకోవచ్చు. డీమనీ తరహాలోనే వివిధ దేశాల్లోని అత్యుత్తమ ఫైనాన్సియల్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి బ్యాంకు సిద్ధమవుతోంది. దీంతో ఇకపై ప్రవాస భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఖాతాలతో పని లేకుండా తేలిగ్గా నిధులు బదిలీ చేసుకునే వెసులుబాటు కలగనుంది. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది.
దీంతో పర్యాటక రంగం కూడా పలు లాభాలు పొందనుంది. విదేశీయులు ఇక్కడకు వచ్చినా వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బులు పొందేందుకు తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో భవిష్యత్ లో కూడా ఏ భయం లేకుండా చేయడమే బ్యాంకు లక్ష్యం. దీంతో ఇండస్ ఇండ్ బ్యాంకు వినియోగదారులకు సులభతరంగా నిధులు పొందే అవకాశం కల్పిస్తోంది.
Also Read: ప్రధాని మోడీ భద్రత కోసం ఎలాంటి కారు కొన్నారో తెలుసా? దాని ప్రత్యేకత ఇదే