Relationship : ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ లైఫ్ ఉన్న వారు సాయంత్రం కాస్త రిలాక్స్ కావాలని చూస్తుంటారు. ఈ క్రమంలో కొందరు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరికొందరు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అయితే ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎలాంటి మానసిక సమస్యలు ఉన్నా.. శృంగారంలో పాల్గొనడం ద్వారా మానసికోల్లాసంగా ఉంటారు. అందుకే పెద్దలు ‘శృంగారం ఆరోగ్యకరం’ అన్నారు. దీంతో చాలా మంది ఉదయం వివిధ పనుల నిమిత్తం ఒత్తిడి ఉన్నవారు సాయంత్రం జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే నేటి కాలంలో పనుల కారణంగా శృంగారం కోసం సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. భార్యభర్తలిద్దరు ఉద్యోగం చేయడం ద్వారానో లేదా ఇంట్లో పిల్లలు ఉండడం వల్లనో చాలా మంది వీటికి ఆసక్తి చూపడం లేదు. అయితే ఎక్కువ రోజులు శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల కొన్ని అనర్థాలు ఎదురవుతాయిన కొన్ని పరిశోధన సంస్థలు తెలుపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
ఒక్కసారి శృంగారంలో పాల్గొనడం ద్వారా శరీరం ఉల్లాసంగా మారుతుంది. కనీసం వారానికి ఒకసారైన జీవిత భాగస్వామితో కలయిక ఉండడం వల్ల మనసు ఉత్తేజంతో ఉంటారని అంటున్నారు. అయితే కొందరు స్త్రీలు వయసు మళ్లిన కొద్దీ దీనిపై ఆసక్తి చూపరు. అయితే ఇలా కంటిన్యూ అవడం వల్ల వారిలో అనేక వ్యాధులకు కారణం అవుతాయట. అంతేకాకుండా కొన్ని దీర్ఘ కాలిక వ్యాధులకు ఇదే కారణం అవుతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.
శృంగారంలో పాల్గొనడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండి గుండెకు మేలు కలుగుతుంది. ఒత్తిడికి దూరం కావడంతో శరీరం ఉల్లాసంగా ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండడం వల్ల కొవ్వు పేరుకుపోకుండా ఉంటంది. దీంతో ఒబెసిటీ వంటి వ్యాధులకు దూరంగా ఉండగలుగుతారు. అలాగే ఒత్తిడి ద్వారా డయాబెటిక్ వ్యాధికి కారణమవుతారు. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకోవడానికి వారంలో ఒకసారైనా రతి క్రీడలో పాల్గొనే అవసరం ఉందని అంటున్నారు.
శృంగారంపై స్త్రీలకు ఆసక్తి తగ్గడం సహజమే. కానీ పురుషులు వారి ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయ్నతం చేయాలి. వారికి శృంగారంపై ఆసక్తి కలిగించే కొన్ని ప్రేరణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా చేయడం ద్వారా వారు సంతోషంగా ఉండడంతో పాటు ఇంటి వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచుతారు. దీంతో ఎలాంటి మానసిక ఒత్తిడులకు గురింకాకుండా ఉంటారు. ఇంట్లో ఉల్లాసమైన వాతావరణం ఉండాలంటే భార్య భర్తల మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకుండా ఉండాలి. వీటి కోసం ఇద్దరి కలయిక కచ్చితంగా ఉండాలి.
ఎక్కువ రోజులు శృంగారం చేయకుండా ఉండడం వల్ల పురుషుల్లోనే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితులు అనుకూలించకపోయే వారిని పక్కనబెడితే.. అవకాశం ఉండి కూడా దూరంగా ఉండడం వల్ల భార్తపై భార్యకు చెడు ప్రభావం పడుతుంది. ఇది చిన్న సమస్య నుంచి పెద్దదిగా మారి ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతాయి. ఇవి చినికి చినికి పెద్దగా మారి విడాకుల వరకు వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల కావాలనే జీవిత భాగస్వామిని దూరంగా పెట్టడం అంత మంచిది కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.