Homeక్రీడలుIND vs AUS : స్టార్క్, అబాట్ దెబ్బకు విలవిల: భారత్ 117 ఆలౌట్

IND vs AUS : స్టార్క్, అబాట్ దెబ్బకు విలవిల: భారత్ 117 ఆలౌట్

 

IND vs AUS : స్టార్క్,అబాట్ దెబ్బకు భారత్ కుప్పకూలింది. 117 పరుగులకు ఆల్ ఔట్ అయింది. గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా టాప్ 7 వికెట్లు బ్యాటింగ్ చేసేవే. కానీ ఏం జరిగింది.. టాప్ ఆర్డర్ ఇద్దరు బౌలర్ల తాకిడికి కుప్పకూలింది. ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరడంతో భారత్ అత్యంత దయనీయస్థితిలో కూరుకుపోయింది. 26 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత జట్టును ఏ దశలోనూ కోలుకోనియ్యలేదు..స్టార్క్ భారత్ టాప్ ఆర్డర్ ను వణికించాడు. ఇతడికి అబాట్ తోడు కావడంతో భారత బ్యాటర్లు క్రీజు లో కుదురుకునేందుకే ఇబ్బంది పడ్డారు. మైదానం తేమగా ఉండటం, బౌలర్లు నిప్పులు చేరిగేలా బంతులు వేయడంతో భారత బ్యా టర్లు బంతిని టచ్ చేసేందుకే వణికి పోయారు.. గిల్, సూర్య కుమార్ యాదవ్, మహమ్మద్ షమీ ముగ్గురూ గోల్డెన్ డక్ గా వెను తిరిగారు అంటే ఆస్ట్రేలియా బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మొదటి వన్డే చచ్చి చెడి గెలిచింది..ఇక రెండో వన్డేలో అయినా జాగ్రత్తగా ఆడుతుంది అనుకుంటే.. మొదటి వన్డేనే అనుసరించింది. 10 ఓవర్లు కూడా పూర్తిగా ముందే సగం టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరుకుంది. కోహ్లీ,జడేజా జట్టును ఆదుకుంటారు అనుకుంటే 31 పరుగులు చేసిన విరాట్ ఎల్లిస్ బౌలింగ్ లో ఎల్ బీ డబ్ల్యు గా ఔట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. జడేజా కూడా ఎల్లిస్ బౌలింగ్ లో ఔట్ కావడంతో భారత్ ఆశలు అడుగంటి పోయాయి.

మొదటి వన్డేలో భారత బ్యాటర్లను వణికించిన స్టార్క్.. ఈ మ్యాచ్ లోనూ అదే బౌలింగ్ కొనసాగించాడు.. మూడు పరుగుల వద్ద గిల్ ను ఎల్ బీ డబ్ల్యు గా ఔట్ చేసిన స్టార్క్.. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ను అవుట్ చేసి భారత శిబిరంలో ఆందోళన రేపాడు.. ఇక అబాట్ కూడా హార్దిక్ పాండ్యా, కులదీప్, షమీని అవుట్ చేసి భారత జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఎల్లిస్ జడేజా, విరాట్ ను ఔట్ చేశాడు. ఈ మైదానం మీద 241 పరుగులు అత్యధిక స్కోరు. కానీ భారత బ్యాట్స్మెన్ ఆట తీరు చూస్తుంటే అది కూడా కొట్టేలా లేరు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టే పేవిలియన్ చేరుతున్నారు. మొదటి వన్డేలో 0 పరుగులకే వెనుదిరిగిన సూర్య కుమార్ యాదవ్.. ఈ మ్యాచ్ లోనూ గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. అంతకుముందు రోజు వర్షం కురవడంతో మైదానం మీద తేమ ఉంది. దీంతో గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ మరో మాటకు తావులేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగేలా బంతులు వేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5 వికెట్లు తీశాడు. అబాట్ 3, ఎల్లిస్ 2 వికెట్లు తీశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular