SRH vs RR IPL 2022: రామేశ్వరం వచ్చినా శనేశ్వరం పోలేదన్నట్టు తయారైంది సన్ రైజర్స్ పరిస్థితి. 2021 ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఎంత చెత్తగా ఆడి అభిమానుల ఆగ్రహానికి గురయిందో చూశాం. ఇప్పుడు తాజా సీజన్ లో కూడా ఇదే పంతాను కొనసాగిస్తోంది. ఈ సీజన్ ను ఘోర ఓటమితో ప్రారంభించింది. అత్యంత చెత్త బౌలింగ్, బ్యాటింగ్ తో ప్రదర్శన చేసి.. మరోసారి తామింతే అని తెలిపింది.

పుణేలో ఉన్న ఎంసీఏ స్టేడియం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఏకంగా 61 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. రాయల్స్ ను ఓడించేందుకు ఏ మాత్రం పోరాట పటిమను చూపించలేదు. అన్ని ఫార్మాట్లలో దారుణమైన ప్రదర్శన చేసి అభిమానుల ఆగ్రహానికి మరోసారి గురైంది.
Also Read: Chandrababu will Gives 40 Percent Tickets To Youth: యువతకే టికెట్లు.. చంద్రబాబు ప్లాన్ ఏంటి?
ఇది సన్ రైజర్స్‌కు మొదటి మ్యాచ్. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్ 6 వికెట్లను కోల్పోయి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తాజా సీజన్ లో ఇప్పటి వరకు ఇదే భారీ స్కోర్. మరి సన్ రైజర్స్ బైలర్ల పనితీరు అలా ఉంది. రాయల్స్ తరఫున బ్యాటింగ్ చేసిన సంజూ సామ్సన్ 27 బంతుల్లో 55పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో దుమ్ము లేపాడు. ఇక జోస్ బట్లర్ కూడా 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. చివరిలో హెట్ మైర్ కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 రన్స్ చేశాడు.
సన్ రైజర్స్ బౌలర్లు అత్యంత పేలవ ప్రదర్శన ఇచ్చారు. వారిలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ మాత్రమే చెరో రెండు వికెట్లు తీసారు. ఇక సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్స్ ఏ మాత్రం జోరు చూపించలేదు. ఏదో ఆడాం అన్నట్టు బ్యాటింగ్ చేశారు. 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి కేవలం 149 పరుగులు మాత్రమే చేశారు. వీరిలో ఎయిడెన్ మార్క్ రమ్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేయగా.. వాషింగ్టన్ సుందర్ చెప్పుకోదగ్గ ఆట ఆడాడు. అతను 14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40పరుగలు చేసి పరువు కాపాడాడు.

రాహుల్ త్రిపాఠి (0), అభిషేక్ శర్మ (9), నికోలస్ పూరన్ (0), అబ్దుల్ సమద్ (4) ఘోరంగా విఫలమయ్యారు. ఇంకేముంది ఐపీఎల్ తాజా సీజన్ లో అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ లో కేవలం వాషింగ్టన్ సుందర్ మాత్రమే ఆకట్టుకున్నాడు. కానీ అతన్ని యాజమాన్యం గుర్తించక ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు పంపడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇక అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మల లను మిడిల్ ఆర్డర్ లో పంపి.. సుందర్ ను చివరలో పంపడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఏరికోరి కొందరిని జట్టులోకి తీసుకున్నా కూడా.. ఏ మాత్రం మార్పు లేదు సన్ రైజరస్ ఆట తీరులో. మరి రాబోయే మ్యాచ్ లలో ఏమైనా ఆకట్టుకుంటుందో చూడాలి.