Someone’s Wife And Someone Else’s: ప్రస్తుత కాలంలో సంబంధాలు చెడిపోతున్నాయి. సంప్రదాయాలకు విలువలు ఇచ్చి.. ఒకరికి ఒకరు తోడుగా ఉండి.. సాయం చేసుకోవాల్సిన కొందరు అడ్డదారులు పడుతూ మానవ సంబంధాలను మంటగలుపుతున్నారు. వావి వరుసలు అనే తేడా లేకుండా ఇష్టమొచ్చినట్లు కాంటాక్ట్ పెట్టుకొని.. ఆ తరువాత దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరు ఇల్లీగల్ కాంటాక్ట్ కోసం అడ్డువచ్చిన ప్రతి ఒక్కరినీ అంతం చేస్తున్నారు. ఆ తరువాత వారు కూడా ఏదో ఒక కారణంతో ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఓ సంఘటన అందరినీ కలిచి వేస్తుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు అయి ఉండి.. వారు ఒకరి భార్యతో మరొకరు కాంటాక్ట్ కొనసాగించారు. ఆ తరువాత ఇద్దరు వివిధ కారణాలతో మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన ఎలా జరిగిందంటే?
ప్రపంచంలో అతి తియ్యటి బంధం స్నేహం అని అంటారు. కొందరు స్నేహం అంటే ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. అలాగే ఇద్దరు స్నేహితులు బాల్యం నుంచి కలిసి ఉన్నారు. కానీ ఆ తరువాత సమాజం ఛీ కొట్టే పనిచేశారు. కర్ణాటకలోని వినాయక్ నాయక్, గురు ప్రసాద్ అనే స్నేహితులు బాల్యం నుంచి కలిసి ఉన్నారు. వీరు చదువు పూర్తి అయిన తరువాత వేర్వే రంగాల్లో స్థిరపడ్డారు. కోట్లు సంపాదించారు. ఆ తరువాత సొంత ఊరిలో ఇళ్లు కట్టుకున్నారు. ఆ తరువాత అందమైన భార్యలను పెళ్లిళ్లు చేసుకున్నారు.
అయితే ఈ రెండు జంటలు అప్పుడప్పుడూ కలుసుకునేవారు. కలిసి విహార యాత్రలకువెళ్లే వారు. కానీ కొన్ని రోజుల తరువా ఒకరి భార్యతో మరొకరు కాంటాక్ట్ పెట్టుకొని కొనసాగించారు. ఈ విషయం సొంత ఊరిలో తెలియడంతో అందరూ ఛీ కొట్టారు. అయినా వీరు ఏమాత్రం పట్టించుకోకుండా తమ సంబంధాలను కొనసాగించారు. అయితే కొన్నాళ్ల తరువాత వినాయక్ నాయక్ గుర్తు తెలియని వ్యక్తుల చేత దారుణంగా చంపబడ్డాడు. అయితే ఈ హత్యకు గల కారణాలను పోలీసులు ఛేదించారు. మొత్తానికి వినాయక్ నాయక్ ను చంపిన ముగ్గురిని గోవాలో పట్టుకున్నారు.
వారు చెప్పి వివరాల ప్రకారం గురు ప్రసాద్ కారణమని వారు చెప్పారు. దీంతో పోలీసులు గురు ప్రసాద్ ను అరెస్టు చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో గోవాకు వెళ్లగా అక్కడ అప్పటికే ఆయన మృతదేహం మాన్వీ నదిలో కనిపించింది. హత్య చేసిన వ్యక్తులను పోలీసులు అదులపులోకి తీసుకున్న తరువాత గురు ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు మరణించడానికి ఇల్లీగల్ కాంటాక్ట్ అని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కానీ మరింత లోతుగా తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించారు. ఇదే సమయంలో ఇలాంటి వ్యవహారాల వల్ల జీవితం నాశనం అవుతుందని పోలీసులు తెలుపుతున్నారు. చాలా మంది డబ్బు, ఇతర వ్యామోహంలో పడి అక్రమ సంబంధాలు కొనసాగించడానికి ఇష్టపడుతారు. కానీ ఇది తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వొచ్చు. అయితే ఈ ప్రభావం తరువాత తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అంటున్నారు. ముఖ్యగా స్నేహం పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి దూరంగా ఉండడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.