https://oktelugu.com/

Maharashtra elections : మహారాష్ట్ర ఫలితాలు.. దేశం కంటే ఏపీ పైనే ప్రభావం అధికం

దేశంలోనే సంపన్న రాష్ట్రం మహారాష్ట్ర. మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు రేపు ఎన్నికలు అక్కడ జరగనున్నాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎక్కువ ప్రాంతీయ పార్టీలుగా ఉన్న ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీల ప్రభావం అధికం. దీంతో ఇక్కడ పోరు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 19, 2024 / 03:45 PM IST

    Maharashtra elections

    Follow us on

    Maharashtra elections : మహారాష్ట్ర ఎన్నికలకు రంగం సిద్ధమయింది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్కడ పోటీ నువ్వా నేనా అన్న స్థితిలో ఉంది. ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య గట్టి ఫైట్ నెలకొంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయం. అక్కడ ప్రాంతీయ పార్టీలను నడుపుతున్నాయి జాతీయ పార్టీలు అయిన బిజెపి, కాంగ్రెస్. ఎన్డీఏ పాలనకు ఇదో రిఫరెండం. ఎందుకంటే అక్కడ శివసేన తో పాటు ఎన్సీపీలను బిజెపి చీల్చిందన్న విమర్శ ఉంది. తప్పకుండా అది ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని విశ్లేషణలు ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపారు. మెజారిటీ ఎంపీ స్థానాలను ఇండియా కూటమికి కట్టబెట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తమ సత్తా చాటుతామని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చెబుతోంది. ఏక్ నాథ్ షిండే మంచి పాలన అందించారని గుర్తు చేస్తోంది. అక్కడ రెండు కూటమిలు ఎనలేని ధీమాతో ఉన్నాయి. అయితే అక్కడి గెలుపోటములు మాత్రం తెలుగు రాష్ట్రాలపై పడడం ఖాయం.

    * సీఎం రేవంత్ ప్రచారం
    మహారాష్ట్ర ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారానికి వెళ్లారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం రేవంత్ రెడ్డి చరిష్మా పెరగడం ఖాయం. తెలంగాణ కాంగ్రెస్కు ఒక టానిక్ లా పనిచేస్తుంది ఈ విజయం. మరోవైపు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. మహారాష్ట్రలో గెలిస్తే మాత్రం తదుపరి యాక్షన్ ఏపీలో ప్రారంభం కానుంది. అదే సమయంలో జాతీయస్థాయిలో ఇండియా కూటమిమరింత బలోపేతం కానుంది. అదే జరిగితే వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

    *పవన్ ముమ్మర ప్రచారం
    మరోవైపు ఏపీ నుంచి డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కు మద్దతుగా మహారాష్ట్రలో పర్యటించారు. బిజెపి వాయిస్ ను బలంగా వినిపించారు.తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయన సభలకు భారీగా జనాలు వచ్చారు. ఒకవేళ అక్కడ ఎన్ డి ఏ గెలిస్తే పవన్ ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఏపీలో సైతం పవన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. జమిలి కి సైతం కూటమి జై కొడుతుంది. మొత్తానికైతే మహారాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపడంతో పాటు.. ఏపీ పై సైతం ముద్ర చాటుకునే అవకాశం ఉంది. మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.