Snoring: నిద్రపోయేటప్పుడు చాలా మంది గురక పెడుతుంటారు. నిజానికి గురక పెట్టినట్లు వాళ్లకి కూడా ఆ విషయం తెలియదు. వారికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కానీ వారి చుట్టూ నిద్రపోయే వారికి మాత్రం నరకమే. గురక సౌండ్‌కి వారు రాత్రంతా అసలు నిద్ర కూడా పోరు. అయితే ప్రతి నలుగురిలో ఒకరు రాత్రిపూట గురక పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో 30 ఏళ్ల లోపు వారు 10 శాతం, 60 ఏళ్లు దాటిన వారిలో 60 శాతం మంది గురక పెడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గురక పెడుతుంటారు. ఇలా పెట్టడం వల్ల తనకి ఇతరులకే కదా ఇబ్బంది.. తనకేం లేదని లైట్ తీసుకోవద్దు. గురక పెట్టడం కూడా కొన్ని సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్లీప్ అప్నియాకి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే గురక ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలు ఏంటి? దీని నుంచి విముక్తి పొందడం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ముక్కు వల్ల రావచ్చు
నాసికా రంధ్రాల్లో ఏదైనా అడ్డు పడటం వల్ల కూడా గురక వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముక్కు లోపల ధూళి వెళ్లి అలెర్జీ, జలుబు, ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు.
నోటి అనాటమీ
వాయుమార్గంలో ఏదైనా ఇబ్బంది ఉంటే గురక వస్తుందట. కొందరికి గొంతు వెనుక భాగంలో అదనంగా కణజాలం ఉంటుంది. దీనివల్ల వాయు మార్గం తగ్గుతుంది. అప్పుుడు గాలి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. దీంతో గురక వస్తుందని నిపుణులు అంటున్నారు.
మద్యం
కొందరు మద్యం ఎక్కువగా సేవిస్తుంటారు. దీనివల్ల కూడా గురక వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ తాగడం వల్ల గొంతు కండరాలను సడలిస్తుంది. దీనివల్ల వాయుమార్గానికి అవరోధం ఏర్పడుతుంది. అలాగే అధిక బరువు ఉన్న వ్యక్తుల్లో కూడా గురక సమస్య ఎక్కువగా ఉంటుందట.
నిద్రలేమి
ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. శరీరానికి సరిపడా నిద్రలేకపోవడం వల్ల కూడా గురక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అలాగే నిద్రపోయే పొజిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
విముక్తి చెందడం ఎలా?
కొందరు నిద్ర పొజిషన్ బట్టి గురక పెడతారు. దీని నుంచి విముక్తి చెందాలంటే ఎడమ వైపు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎడమ వైపు తిరిగి నిద్రపోవడం వల్ల శ్వాస నాళాలు మెరుగుపడతాయి. దీంతో గురక తగ్గుతుందట. స్లిపింగ్ పొజిషన్‌ను ఎప్పటికప్పుడూ మార్చాలి. అలాగే బరువుగా ఉంటే తగ్గాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అధిక బరువు వల్ల కూడా గురక వస్తుంది. కాబట్టి ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.