Sridevi’s husband’s: ఎంతో మంది హీరోలు హీరోయిన్ లు తెర మీద ఆకట్టుకుంటారు. తెర మీద ఎంతో అందంగా, అందరినీ అలరించి, సంతోష పెట్టే వారికి కూడా చాలా విషాధ సంఘటనలు ఉంటాయి. కొందరి విషయాలు తెలిస్తే చాలా బాధ అనిపిస్తుంది. అయితే మీకు శ్రీదేవి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక తన భర్త బోనీ కపూర్ గురించి కూడా పరిచయం అవసరం లేదు. అయితే బోనీ కపూర్ మొదటి భార్య ఎవరో మీకు తెలుసా? అర్జున్ కపూర్ తల్లి మౌనా శౌరీ. వీరిద్దరు విడిపోయిన తర్వాత బోనీ కపూర్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారు.
అర్జున్ కపూర్ బాలీవుడ్ స్టార్ అయినా సరే తన గురించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. కొందరికి ఫేవరెట్ స్టార్ కూడా. ఇక ఈయన రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో తన బాల్యం గురించి తన తండ్రి గురించి కొన్ని కామెంట్లు చేశారు. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. అర్జున్ కపూర్ తల్లిదండ్రులు బోనీ కపూర్ మోనా శౌరీ నటుడికి 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు విడిపోయారు. ఇక ఈ నటుడు తన తల్లిదండ్రులు విడిపోవడం గురించి తరచుగా చెబుతుంటాడు. మోనా నుంచి విడాకులు తీసుకున్న తరువాత, బోనీ కపూర్ దివంగత నటి శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. రాజ్ షమణితో ఇటీవల జరిగిన చాట్‌లో, అర్జున్ విడిపోవడాన్ని, దానిని ఎలా ఎదుర్కొన్నాడో గుర్తుచేసుకున్నాడు.
విడిపోవడం గురించి అర్జున్ కపూర్ మాట్లాడుతూ, “నాకు 10 సంవత్సరాల వయస్సులో నా తల్లిదండ్రులు విడిపోయారు. ఆ సమయంలో మంచి చెడు అర్జున్ కి అర్థం కాలేదట. కానీ ఇప్పుడు ఒక్కసారి వెనకు తిరిగి ఆలోచిస్తే చాలా విషయాలు బాధ పెడుతున్నాయి అని.. ఎన్నో విషయాలు గుర్తు వస్తున్నాయి అన్నారు అర్జున్ కపూర్.
మరికొన్ని విషయాలు కూడా తెలుపుతూ.. ఇదంతా జరుగుతున్న సమయంలో తన తండ్రి చాలా బిజీగా ఉన్నారట. రెండు పెద్ద సినిమాలతో చాలా బిజీగా ఉన్నారట. ప్రేమ్ అండ్ రూప్ కి రాణి చోరో కా రాజా సినిమా చేస్తున్నారట బోనీ కపూర్. ఆ సినిమాలను పూర్తి చేసి విడుదల చేయాలనే పనిలో పడ్డారట. అదే సమయంలో చాలా ఒత్తిడికి కూడా గురి అయ్యాడట. అందుకే అర్జున్ కు తన తండ్రి బోనీ కపూర్ కు నార్మల్ తండ్రి కొడుకులకు ఉన్న రిలేషన్ కూడా వారి మధ్యలో లేదట. అంటే స్కూల్ కు తీసుకొని వెళ్లడం, తీసుకొని రావడం వంటి వాటికి కూడా తన తండ్రికి సమయం లేదని గుర్తు చేసుకున్నారు అర్జున్ కపూర్.
ఆ సమయం ఆయనకు లేదు. కనీసం నాకు కూడా ఆ ఆలోచన లేదు అన్నారు ఈ హీరో. ఇదే సమయంలో తల్లిదండ్రులు విడిపోయారట. అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది అన్నారు అర్జున్. ఇక వీరిద్దరు విడిపోయిన తర్వాత, తల్లి మౌనాకు క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. అంతేకాదు రక్త పోటుతో కూడా ఉన్నట్లు నిర్ధారణ అయింది. బహుళ అవయవ వైఫల్యం వల్ల తన పిల్లల ముందే మార్చి 2012 లో కన్ను మూసింది మోనా శౌరీ.