Astro Tips : హిందూ శాస్త్రంలో ఎన్నో పట్టింపులు ఉన్నాయి. ప్రతీ దానికి కూడా ఒక నియమం ఉంటుంది. వాటి ప్రకారమే నడచుకుంటారు. అయితే కొన్ని పనులు ఈ వారాల్లో చేయకూడదు, ఈ వారాల్లో చేయాలని మన పండితులు చెబుతుంటారు. ఇప్పుడు తరం వాళ్లు అయితే సమయం, వారం అనే తేడా లేకుండా జట్టు కట్ చేయడం, గోర్లు కట్ చేయడం వంటివి చేస్తున్నారు. పూర్వకాలంలో అయితే అన్ని రోజులు జుట్టు కత్తిరించకుండా కేవలం కొన్ని రోజుల్లో మాత్రమే కట్ చేయించుకునేవారు. వారంలో అన్ని రోజులు కాకుండా కొన్ని రోజులు మాత్రమే జుట్టు కత్తిరించాలని, లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని మన పండితులు అంటున్నారు. అసలు జుట్టును వారంలో ఏ రోజు కత్తిరించాలి? చేయకూడని రోజులు ఏవి? వీటిని పాటించడం వల్ల జీవితంలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మరి తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
జుట్టును రోజులో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల లోగా మాత్రమే కత్తిరించుకోవాలని పండితులు అంటున్నారు. ఆ తర్వాత చేసుకుంటే పేదరికం, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే సోమవారం, శుక్రవారం అసలు జుట్టు కత్తిరించకూడదట. ఈ వారాల్లో జుట్టు కత్తిరిస్తే ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతాయి. ప్రశాంతత ఉండదు. ఎంత సంపాదించిన కూడా ఇంట్లో డబ్బు నిల్వ ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. వివాహితులు అయితే గొడవలతోనే జీవితం గడుస్తుందని శాస్త్రం చెబుతోంది. జుట్టు కత్తిరించుకోవాలనుకునే వారు బుధవారం చేసుకోవాలని పండితులు అంటున్నారు. బుధవారం రోజు జుట్టు కత్తిరించుకుంటే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందట. అలాగే దేవుని ఆశీస్సులు లభిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.
పవిత్రమైన గురువారం రోజు కూడా జుట్టు కత్తిరించుకోకూడదని పండితులు అంటున్నారు గురువారం రోజు జుట్టు కత్తిరించుకోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దీంతో ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయట. అలాగే శనివారం, ఆదివారం కూడా జుట్టు కత్తిరించుకోకూడదట. ఎందుకంటే ఈ రెండు రోజుల్లో ఏ రోజు జుట్టు కత్తిరించుకున్న కూడా పితృ దోషం కలుగుతుందని పండితులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజులు జుట్టు కత్తిరించుకోవద్దు. వీలైతే బుధవారం రోజు జుట్టు కత్తిరించుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. లేకపోతే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువా అయిపోతాయని పండితులు అంటున్నారు. ఈ నియమాలు పాటిస్తేనే జుట్టు కూడా పెరుగుతుందని, ఏ రోజు పడితే ఆ రోజు కత్తిరిస్తే జుట్టు పెరుగుదల తగ్గిపోవడంతో పాటు రాలుతుందట. కాబట్టి ఈ నియమాలు పాటించడానికి ప్రయత్నించండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.