Snakes:పాములు అంటే చాలా మందికి భయం ఉంటుంది. సాధారణంగా వీటిని ఫొటోలు చూస్తేనే భయపడుతుంటారు. అలాంటిది డైరెక్ట్‌గా చూస్తే అసలు దాని దరిదాపుల్లో కూడా ఉండరు. అయితే పాములు కూడా ఈ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటి. కొందరు వీటిని తలచుకుని కూడా భయపడుతుంటారు. ఇవి చాలా విషపూరితమైనవి. పాము మాత్రానికి ఎవరిని అయిన కాటేస్తే ఇక పైకి పోవాల్సిందే. మళ్లీ బతికారంటే మాత్రం వారు నిజంగానే అదృష్ట వంతులు అని అనుకోవాలి. చాలా మంది ఈ పాము విషంతో చనిపోతున్నారు. సాధారణంగా పాముల దారికి అడ్డు వెళ్తేనే అవి కాటేస్తాయని అంటుంటారు. మనిషి కదలికలను గుర్తు పట్టి మరి పాము కాటేస్తుందని అంటారు. అసలు పాములకు చెవులు ఉండవు. కానీ అవి ఎలా శబ్దాలను వింటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాములకు బాహ్య చెవులు ఉండవు. కానీ లోపల చెవులు మాత్రం ఉంటాయి. అందుకే ఇవి శబ్దాలను వింటాయి. పాముకి లోపల ఉండే చెవి ధ్వని ప్రకంపనాలను గుర్తిస్తాయి. సాధారణంగా మానవులు అయితే 20 నుంచి 20 వేల హెర్ట్జ్ వరకు శబ్దాలను వింటారు. అదే పాములు అయితే 200 నుంచి 300 హెర్ట్జ్ వరకు శబ్దాలను వింటాయట. అలాగే పాములు భూమి ప్రకంపనాలను గుర్తిస్తాయి. దవడ ఎముకల ద్వారా భూమి ప్రకంపనాలను పాములు గుర్తిస్తాయి. పాములు వాటి చర్మం నుంచి కూడా శబ్దాన్ని వినగలుగుతాయి. అందుకే వాటిపైన ఎవరైనా దాడి చేస్తే ఈజీగా గుర్తిస్తాయి. మిగతా క్షీరదాల కంటే పాములు చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి పిల్లలను కనకుండా గుడ్లు పెడతాయి. అయితే కొన్ని పాములు మాత్రమే గుడ్లు పెడతాయి. అన్ని పాములు కూడా గుడ్లు పెట్టవు.
పాములు భయంకరంగా ఉండటానికి ఓ కారణం ఉందట. వీటికి కనురెప్పలు ఉండకపోవడమేనట. దీనివల్ల ఇవి ఎప్పుడు కళ్లు తెరిచే ఉంటాయి. అందుకే భయంకరంగా ఉంటాయి. పాములు నిద్రపోయినప్పుడు కూడా కండ్లు తెరిచే ఉంటాయట. వీటికి సన్నని పొర కూడా ఉంటుంది. మనుషులకు ఉన్నట్లే పాములకు కూడా ముక్కు రంధ్రాలు ఉంటాయి. కానీ ఇవి వాసన చూడవు. కేవలం నాలుకతో మాత్రమే వాసన చూస్తాయట. అందుకే అవి తమ నాలుకలను లోపల కంటే బయటే పెట్టుకుంటాయట. దీనివల్లే పాములు ఈజీగా ఎవరిని అయిన కూడా కాటేస్తాయి. ఈ ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 2500 నుంచి 3000 రకాల పాములు ఉంటాయట. పాముల విషం చాలా ప్రమాదకరం. ఇవి కాటేస్తే తప్పకుండా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Snakes dont snakes have ears how do they actually hear
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com