Relationship: మీ భాగస్వామిని హగ్ చేసుకొని పడుకుంటున్నారా?

భర్తను భార్య భార్యను భర్త హగ్ చేసుకొని పడుకోవడం లో ఎలాంటి తప్పు లేదు. అయితే దీని వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

Written By: Swathi Chilukuri, Updated On : June 15, 2024 12:10 pm

Relationship

Follow us on

Relationship: అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఈ బంధాన్ని నిలుపుకోవడం కూడా చాలా కష్టమే అని చెప్పాలి. ఒకసారి గొడవలు మొదలైతే దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. కానీ వాటిలో కూరుకుపోయి బంధాన్ని వీక్ చేసుకోవడం, లేదా విడిపోవడం వంటి పనులు చేయకూడదు. దీని వల్ల మంచి రిలేషన్ మీ మధ్య ఉండదు. అయితే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు మీ రిలేషన్ చాలా అందంగా, ఆదర్శనీయంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా హగ్ చేసుకొని పడుకోండి.

భర్తను భార్య భార్యను భర్త హగ్ చేసుకొని పడుకోవడం లో ఎలాంటి తప్పు లేదు. అయితే దీని వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. భార్యాభర్తలన్నాక కలిసి ఒకే గదిలో పడుకోవడం కామన్. అలాగే నిద్రించాలి కూడా. ఇతర గదుల్లో పడుకుంటే ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు. ఇక నిద్ర పోతున్నప్పుడు కౌగిలించుకొని పడుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. దీంతో రోజంతా హ్యాపీగా ఉంటారని అంటున్నారు నిపుణులు.

హగ్ చేసుకొని పడుకోవడం వల్ల మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి. నిద్రపోయినప్పుడు భాగస్వామిని కౌలిగించుకుంటే మనసుకి ఆనందంగా ఉంటుందట. ఇలా పడుకోవడం వల్ల శరీరం ఆక్సిటోసిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ఇది భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఆనందాన్నిస్తుంది. మీ పార్టనర్‌ని కౌగిలించుకుని పడుకుంటే.. రాత్రంతా హాయిగా నిద్రపోతుంటారు. దీంతో ఒత్తిడి, గందరగోళం తగ్గుతుంది. ఇద్దరి మనసు ఆనందంగా, ఉల్లాసంగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం చాలా రీఫ్రెషింగ్‌ ఫీల్ కూడా వస్తుంది.

ఇద్దరు కలిసి పడుకుంటే విడుదల అయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ శరీరంలోని ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తుంది. మంటని కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది. అంతేకాదు ఇమ్యూనిటీని పెంచుతుంది. మీ రిలేషన్‌ బలంగా ఉండాలంటే మీకు, మీ భాగస్వామికి మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరం అని గుర్తు పెట్టుకోండి. హగ్గింగ్ అనేది ప్రేమని వ్యక్తపరిచే బాడీ లాంగ్వేజ్ అంటారు నిపుణులు. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ఇద్దరి మధ్య బంధం చాలా బలపడుతుంది. మీ రిలేషన్ హెల్దీగా ఉంటుంది.