Diabetes: షుగర్ ఉన్న వారు రాత్రి అన్నం తినవచ్చా?

రోజూ అన్నం తినడం వల్ల షుగర్ పెరిగే అవకాశం ఉందట. ఎందుకంటే బియ్యంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. అన్నం ఎక్కుగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి.

Written By: Swathi Chilukuri, Updated On : June 15, 2024 12:13 pm

Diabetes

Follow us on

Diabetes: షుగర్ వ్యాధి ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంది. ఒకసారి ఇది వస్తే చాలా జాగ్రత్త పడాల్సిందే. లేదంటే మరిన్ని రోగాలకు మనమే మన బాడీలోకి రోగాలని ఆహ్వానించినవారిమి అవుతాము. షుగర్ వచ్చినవారు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటారు నిపుణులు. ముఖ్యంగా రాత్రి భోజనం తీసుకోవద్దు అని చెప్తారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని..అందుకే అన్నం తీసుకోకపోవడం మంచిది అంటారు. మరి రాత్రి అన్నం తినవచ్చా? లేదా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ అన్నం తినడం వల్ల షుగర్ పెరిగే అవకాశం ఉందట. ఎందుకంటే బియ్యంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. అన్నం ఎక్కుగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి. ఇప్పటికే షుగర్ ఉంటే వైట్‌రైస్ తినకపోవడం చాలా బెటర్. వైట్ రైస్‌తో పోలిస్తే మన ఆరోగ్యానికి బ్రౌన్‌రైస్ మరింత మంచిదట. టైప్ 2 షుగర్ ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకతని శరీరం కలిగి ఉంటుంది.అయితే రక్తంలో చక్కెర పెరుగుదలని సరిగ్గా భర్తీ చేయడానికి తగినంతగా ఉత్పత్తి చేయకపోవచ్చు.

అందుకే రోజంతా కార్బోహైడ్రేట్స్ తినాలి. రాత్రుళ్ళు మాత్రం వైట్‌రైస్ బదులు బ్రౌన్‌రైస్, క్వినోవా, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే మీ షుగర్ ను కాస్త కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఎందుకంటే.. తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి సహాయం చేస్తుంది. ఇక రాత్రి సమయంలో జీవక్రియని మందగిస్తుంది. కాబట్టి, ఎక్కువగా ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి.

తెల్లబియ్యంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాదు అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్స్ లు ఉంటాయి. వీటి వల్ల బరువు పెరుగుతారు. కానీ డయాబెటిక్ ఉన్నవారికి బరువు పెరగడం మంచిది కాదు. మరో విషయం ఏంటంటే బియ్యంలో ఫైబర్ ఉండదు. కానీ, అధిక చక్కెర స్థాయిల కారణంగా జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. షుగర్ ఎక్కువగా ఉంటే కాలేయం కూడా దెబ్బతింటుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి, రాత్రుళ్ళు వైట్ రైస్ బదులు, సలాడ్స్, బ్రౌన్‌రైస్, క్వినోవా వంటివి తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు.