Sleeping Tips: రోజుల వయసున్న పిల్లలు18 గంటలు నిద్ర పోవాలి, చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలట, టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొంతమందిలో నిద్రలేమికి కారణం అనారోగ్యమని చెప్పడం కష్టమని, ఐతే నిద్రలేమి, అనారోగ్యం అనేవి ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని ఇటీవల జరిగిన సర్వేలు సైతం చెబుతున్నాయి. ముఖ్యంగా రాత్రంతా హాయిగా నిద్రపోవాలంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అసలు రాత్రి నిద్ర సమయంలో ఎలాంటివి చేయాలి.. ఎలాంటివి చేయకూడదు.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రపోయే సమయానికి కనీసం రెండు మూడు గంటల ముందే రాత్రి భోజనాన్ని ముగించడమనేది ఆరోగ్యకరమైన అలవాటు. కొన్ని సార్లు ఇలా ముందుగా ఆహారం తీసుకోవడం వల్ల నిద్రవేళకు ఆకలి అనిపించవచ్చు. అటువంటప్పుడు కొద్దిగా పండ్లు లేదా పాలు తీసుకుని నిద్రపోవడం కొంత మందికి అలవాటు. పాలు, పెరుగు, మజ్జిగ, జామ, అరటి, పుచ్చ, బొప్పాయి, పైనాపిల్, కివి మొదలైన పండ్లలో ట్రిప్టోఫాన్ అనే ఓ రకమైన అమైనో ఆమ్లం ఉంటుంది.
Also Read: Renuka Chowdhury: రేణుకా చౌదరి నోటికి, చెయ్యికి ఎప్పుడూ పదునే
ఈ ట్రిప్టోఫాన్ మన శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్, నయసీనమైడ్ మొదలైన వివిధ రకాల రసాయనాలుగా రూపాంతరం చెందుతుంది. ఇందులో సెరోటోనిన్ ఆందోళన నియంత్రించేందుకు, మెలటోనిన్ చక్కటి నిద్రకు ఉపయోగపడతాయి. కాబట్టి నిద్రకు ఉపక్రమించే ముందు ఓ కప్పు పాలు తాగడం లేదా కప్పు పండ్లు తినడం వల్ల నిద్ర సరిగా పట్టేందుకు అవకాశం ఉంది. అలాగే తొందరగా భోజనం చేసినప్పుడు రాత్రి నిద్రలో ఆకలి వేసి మెలకువ రాకుండా ఉండేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. కేవలం పాలు, పండ్లేకాక, బాదం, ఆక్రోట్, పిస్తా లాంటి గింజలు కూడా ఐదారుకు మించకుండా నిద్రపోయే ముందు తీసుకోవడం ఉత్తమమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కొంతమందికి రాత్రి పడుకునేముందు కూడా మొబైల్ ఫోన్ చూడడం అలవాటు. మరికొందరికేమో టీవీలు చూడడం హాబీ.. కానీ ఈ రెండు అలవాట్లేకాకుండా చాలామంది తమ అలవాట్ల కారణంగా సంతృప్తిగా నిద్ర పోలేకపోతున్నారు. నిద్ర పోయేప్పుడు వెల్లకిలా పడుకోవడమే సరైనది. పక్కకి తిరిగి పడుకున్నా, బోర్లా పడుకున్నా మంచిది కాదు. ఇందు వల్ల బాక్ పెయిన్ రావడమే కాదు, ముఖం మీద ముడతలు వస్తాయి. యాక్నే వస్తుంది. బోర్లా పడుకునే వారికి నుదుటి మీద గీతలు చాలా స్పష్టం గా కనపడుతూ ఉంటాయి. వెల్లకిలా పడుకోవడం వల్ల ఫేస్ క్లియర్ గా ఉంటుంది. స్కిన్ కి ఎలాంటి ఫ్రిక్షన్ ఉండదు. అయితే, ఆల్రడీ వెల్లకిలా పడుకునే అలవాటున్న వారు దిండు పెట్టుకుని పడుకోవడం మర్చిపోకూడదు.
నిద్రకీ, అప్పియరెన్స్ కి చాలా దగ్గర సంబంధం ఉందని మనందరికీ తెలుసు. రాత్రి సరిగ్గా నిద్ర లేకపోతే తెల్లవారే సరికి కళ్ళు ఉబ్బిపోయి కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వచ్చేసి ముఖం పీక్కు పోయినట్లు అవుతుంది. పడుకోవడానికి ముందు కనీసం గంట నుంచీ మొబైల్, టీవీ, కంప్యూటర్ వంటి వాటి నుంచి దృష్టిని మరల్చి సంగీతం వినడం, ధ్యానం చేసుకోవడం వంటివి ఎంతో మంచి ఫలితాలనిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిద్ర పోయే సమయంలో ఆల్కహాల్ తీసుకుంటే సౌండ్ స్లీప్ ఉండదు. ఆల్కహాల్ లోపలి సిస్టం మొత్తం డిస్ట్రబ్ చేస్తుంది. రాత్రి పార్టీ ఉందన్నా, వర్క్ రిలేటెడ్ ఫంక్షన్ లో ఆల్కహాల్ సర్వ్ చేస్తారని తెలిసినా మీ నిద్ర టైం కి రెండు మూడు గంటల ముందు ఆల్కహాల్ ఆపేసి నీరు తాగడం మొదలుపెట్టండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిద్ర పోయే ముందు మేకప్ రిమూవ్ చేయాలి. రోజంతా ముఖం మీద పేరుకున్న మురికి, జిడ్డు, మేకప్ తో కలిసి పోర్స్ లోకి వెళ్ళిపోతాయి.దీని వల్ల చర్మం డ్రై గా కూడా అయిపోతుంది.
Also Read:Agneepath Scheme Protest: ‘అగ్నిపథ్’తో రాజుకున్న ఉత్తరాది.. అసలేంటి కారణం?