AP Movie Tickets Issue: ఏపీ ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య మళ్లీ వివాదం మొదలైంది. టికెట్లను ఏపీఎఫ్ డీసీ ద్వారా ఆన్లైన్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవో 69ను కూడా జూన్ 2న విడుదల చేసింది జగన్ సర్కార్. ఈ మేరకు నెలరోజుల్లో థియేటర్లు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఎంవోయూ చూసి ఎగ్జిబిటర్లు కంగుతిన్నారు. టికెట్ల విక్రయం తర్వాత థియేటర్లకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారో స్పష్ఠతలేదు.అందుకే, ఈ విషయంలో ఎగ్జిబిటర్లు అభ్యంతరం తెలిపారు. ఆన్లైన్ విక్రయాలు ఫిలిం ఛాంబర్ ద్వారా నిర్వహిస్తామని ఎగ్జిబిటర్లు కోరారు. కావాలంటే ప్రభుత్వానికి లింక్ ఇస్తామని ఎగ్జిబిటర్ల లేఖలో తెలిపారు. దీనికి విరుద్ధంగా ప్రభుత్వ గేట్వే ద్వారానే టికెట్లు విక్రయించాలని జీవోలో పేర్కొన్నారు. అయితే, ఎంవోయూపై సంతకం పెడితే ప్రభుత్వ చేతుల్లో చిక్కినట్లేనని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. జులై 2 లోపు సంతకం చేయకపోతే లైసెన్స్లు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల ఆందోళనపై సీఎంకు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది. ఒప్పందంపై సంతకాలు చేసేది లేదని, థియేటర్లు మూసేందుకు కూడా వెనుకాడేది లేదంటూ ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ప్రైవేటు టిక్కెటింగ్ యాప్‌లు ఏ రోజు డబ్బులు ఆ రోజు ధియేటర్లకు జమ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని ఎంవోయూలో పెట్టమని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం అలా చేసేందుకు సిద్ధపడటం లేదు. అదే సమయంలో ఫిల్మ్ చాంబర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కావాలంటే.. తమ ఫ్లాట్ ఫామ్‌పై అమ్మకాలు చేసి..ప్రభుత్వం చెప్పిన రెండు శాతం కమిషన్ ఇస్తామని… పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని అంటోంది. అయితే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. సినిమా టిక్కెట్లపై వచ్చే కలెక్షన్లు మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖాతాలోకి చేరాలి. దాన్నుంచి రెండు శాతం కమిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది.
Also Read: Renuka Chowdhury: రేణుకా చౌదరి నోటికి, చెయ్యికి ఎప్పుడూ పదునే
కానీ కలెక్షన్లు ఎప్పుడుమళ్లీ ధియేటర్ల వారికి.. తిరిగి ఇస్తారో మాత్రం చతెప్పడం లేదు. దీంతోనే సమస్య వచ్చి పడుతోంది. చెల్లింపుల్లో ఏపీ ప్రభుత్వం ట్రాక్ రికార్డు దారుణంగా ఉండటంతో… నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భయపడుతున్నారు. తమ కలెక్షన్ అసలు ప్రభుత్వం తీసుకోవడం ఏమిటని ఓ వైపు మధనపడుతూండగా… మరో వైపు అసలు డబ్బులెప్పుడిస్తారో కూడా చెప్పకుండా ఎంవోయూపై సంతకం పెట్టాల్సిందేనని ఒత్తిడి తేవడం ఏమిటని కంగారు పడుతున్నారు.
Also Read:Agneepath Scheme Protest: ‘అగ్నిపథ్’తో రాజుకున్న ఉత్తరాది.. అసలేంటి కారణం?