https://oktelugu.com/

Relation: 5 సెకన్ల గ్యాప్ తో భార్యాభర్తల మధ్య గొడవలకు చెక్ పెట్టండిలా!

కొందరు భాగస్వాములు చిన్న విషయాలకు కూడా గొడవలను యుద్ధాలుగా మలుస్తారు. కోపంలో ఇద్దరు కూడా అరిచి చిన్న గొడవలను కాస్త పెద్దది చేస్తుంటారు. అయితే గొడవ వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి. లేకపోతే సమస్యకు పరిష్కారం ఉండదు. అయితే ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు ఒక 5 సెకన్లు గ్యాప్ తీసుకుంటే పెద్దవి కావని నిపుణులు చెబుతున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 10, 2024 / 04:38 PM IST

    Relationship

    Follow us on

    Relation: పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయిలు అయిన అబ్బాయిలు అయిన వారిని అర్థం చేసుకునే భాగస్వామి రావాలని కోరుకుంటారు. భాగస్వాముల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఎంత మంచిగా ఉన్న కూడా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సహజం. వీటిని చిన్నగా క్లియర్ చేసుకుని మళ్లీ కలిసిపోయే వారు కొందరు అయితే.. మరికొందరు చిన్న గొడవలను పెద్దగా చేసుకుని, విడాకుల వరకు వెళ్తుంటారు. అయితే చీటికి మాటికి గొడవలు పడే భాగస్వామిని అసలు ఎవరూ ఇష్టపెట్టుకోరు. కొందరు భాగస్వాములు చిన్న విషయాలకు కూడా గొడవలను యుద్ధాలుగా మలుస్తారు. కోపంలో ఇద్దరు కూడా అరిచి చిన్న గొడవలను కాస్త పెద్దది చేస్తుంటారు. అయితే గొడవ వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి. లేకపోతే సమస్యకు పరిష్కారం ఉండదు. అయితే ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు ఒక 5 సెకన్లు గ్యాప్ తీసుకుంటే పెద్దవి కావని నిపుణులు చెబుతున్నారు. ఒకరు కోపం అయ్యారని, ఇంకోకరు కూడా అరిస్తే సమస్య పెరుగుతుంది. అదే ఎవరో ఒకరు అర్థం చేసుకుని కాస్త తగ్గితే సమస్య పరిష్కారం అవుతుంది. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు 5 సెకన్ల పాటు గ్యాప్ తీసుకుంటే గొడవ సర్దు మనుగుతుందని నిపుణులు అంటున్నారు. మొత్తం 81 జంటలపై జరిగిన సర్వేలో ఈ విషయాన్ని నిపుణులు తెలియజేశారు.

     

    చిన్న గొడవ లేదా పెద్ద గొడవ అయిన కూడా తిరిగి సమాధానం ఇవ్వకుండా కాస్త కామ్‌గా ఉండాలి. ఏం ఆలోచించకుండా ఊపిరి పీల్చుకోవాలి. దీంతో ఈజీగా సమస్య తగ్గుతుంది. కోపంలో ఏదో తెలియక మాటలు అంటుంటారు. అదే కాస్త కూల్‌గా 5 సెకన్లు ఆగి ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కేవలం పార్ట్‌నర్‌తోనే కాకుండా ఎవరితోనైనా కూడా ఇదే టెక్నిక్ ఫాలో అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. అసలు ఎవరితో కూడా గొడవలు ఉండవు. మీకు ఎప్పుడైనా భాగస్వాముల మధ్య గొడవలు వస్తే ఒక 5 సెకన్లు గ్యాప్ తీసుకుని ఆలోచిస్తే.. ఇద్దరి మధ్య విబేధాలు రావు. గొడవల కారణంగా కొందరి మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే గొడవ వచ్చినప్పుడు కాస్త స్పేస్ తీసుకుంటే ఎలాంటి మనస్పర్థలు రాకుండా సంతోషంగా ఇద్దరు భాగస్వాములు ఉంటారు. లేకపోతే కోపంలో ఎన్నో మాటలతో భాగస్వామిని అనుమానిస్తారు. కోపంలో అన్న మాటలు గుర్తు ఉండకపోవచ్చు. కానీ పడిన వారు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. చిన్న గొడవ వచ్చినప్పడు కామ్‌గా ఉండి కళ్లు మూసుకుని ఆలోచించండి. గొడవలు వచ్చినప్పుడు వెంటనే మాటలు అనుకోకుండా.. ఒక అరగంట తర్వాత ఆ సమస్య గురించి కూల్‌గా మాట్లాడి పరిష్కరించుకోండి. అప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకపోతే మనస్పర్థలు వచ్చి ఇద్దరి మధ్య దూరం పెరిగి, గొడవలు పెరుగుతాయి. కానీ ఇద్దరి మధ్య బంధం ఇంకా దగ్గర కాదు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.