
Eating Bed: మంచం మీద కూర్చుని అన్నం తింటున్నారా? అయితే జాగ్రత్త సుమా?మనం ఇల్లు కట్టుకునేటప్పుడే వాస్తు ప్రకారం ఉండేలా చర్యలు తీసుకుంటాం. కానీ ఎక్కడో ఓ చోట ఏమరుపాటుగా ఉంటే అదే మనకు సమస్యల్ని తెస్తుంది. మనం చేసే చిన్న పొరపాట్లే మనకు ప్రతిబంధకాలుగా నిలుస్తాయి. వాస్తుకు సంబంధించిన తప్పులతోనే మనకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో వీటికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. అసలు సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మనం చేసే తప్పులు తెలుసుకుని ప్రవర్తిస్తే మంచి లాభాలే వస్తాయి.
మంచం మీద..
మనలో చాలా మంది మంచం మీదే కంచం పెట్టుకుని తింటారు. దీని వల్ల వాస్తు ప్రకారం సమస్యలు వస్తాయి. పేదరికం రావడానికి కారణమవుతుంది. మంచంలో కూర్చుని తినడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నేల మీద అయినా కూర్చుని తినాలి. లేదంటే ఏదైనా కుర్చీ మీద కూర్చుని భోజనం చేయడం సమంజసం. రాత్రి పూట వంట గదిని శుభ్రం చేసుకోవాలి. రాత్రి పూట వంటగదిని శుభ్రం చేయడం వీలు కాకపోతే పాత్రలను అక్కడ ఉంచుకోవడం సురక్షితం కాదు.
ఇంటి ప్రధాన ద్వారం..
ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టలను ఉంచుకోకూడదు. చీపురు కూడా అక్కడ పెట్టొద్దు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సాయంత్రం సమయంలో పాలు, పెరుగు, ఉప్పు దానం చేయొద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. వాస్తు ప్రకారం ఇంటిని సర్దుకోవాలి. లేదంటే చిక్కులు ఏర్పడతాయి. వాస్తు ప్రకారం అన్ని ఉంటేనే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇలా వాస్తు పద్ధతులు పాటించి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

బాత్ రూంలో..
రాత్రి పూట బాత్ రూంలో నల్ల బకెట్ ఉంచకూడదు. ప్రతికూల శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరంగా ఉండాలంటే నిద్రించే సమయంలో ముందు బకెట్ నిండా నీళ్లు నింపి బాత్ రూంలో ఉంచాలి. దీని వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇలా వాస్తు చిట్కాలు పాటించి సమస్యలు లేకుండా చూసుకోవాలి. దీని కోసం కొన్ని మార్గాలు అన్వేషించాలి. అప్పుడే మనకు వాస్తుతో తిప్పలు పడే బదులు పక్కా వాస్తు చూసుకుంటే ఎలాంటి సమస్యలు రావని తెలుసుకోవాలి.