
Zodiac Signs: జ్యోతిష్యం ప్రకారం మార్చి నెలలో కొన్ని రాశులకు అఖండ ఫలితాలు రానున్నాయి. 12 రాశుల వారికి శుభ లేదా అశుభ ప్రభావాలు కలగనున్నాయి. మార్చి ప్రత్యేకమైన మాసంగా చెబుతున్నారు. ఫాల్గుణ మాసంలో అందరికి మేలు కలిగే అవకాశాలున్నాయి. గ్రహాల సంచారం కారణంగా మార్చి నెల ముఖ్యమైనది కావడంతో పెను మార్పులు సంభవించనున్నాయి. వచ్చే నెలలో కుజుడు మిథున రాశిలో, బృహస్పతి మీనరాశిలో ప్రవేశించనున్నారు. మీన రాశిలో బుధుడు, గురు గ్రహాల రాకతో బుధాదిత్య యోగం కలుగుతుంది. అదే నెలలో బుధుడు మళ్లీ రాశి మారుతాడు. మేషరాశిలోకి వెళ్తాడు. మార్చి నెలలో గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశులకు అద్భుత ఫలితాలు అందనున్నాయి.
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి ఈ మాసం బాగుంటుంది. ఉద్యోగులకు మంచి ఫలితాలు కలుగుతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎంతో ప్రగతి కనిపిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో కూడా లాభాలు పలకరిస్తాయి. మహిళలకు కూడా మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. శుభకార్యాలు నిర్వహించేందుకు అనుకూలమైన కాలం. డబ్బు కూడా సమయానికి చేతికి అందుతుంది. జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. అనుకున్నది సాధిస్తారు.
సింహ రాశి వారికి..
సింహరాశి వారికి కూడా అన్ని కలిసి వస్తాయి. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. కుటుంబ సభ్యుల్లో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. తుల రాశి వారికి కూడా లక్ష్మీ కటాక్షం దక్కుతుంది. పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దేనికి కూడా మధ్యవర్తిత్వం వహించడం మంచిది కాదు. మంచి ధనలాభం కలుగుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం కావడంతో అనుకున్నది సాధిస్తారు.

మీన రాశి..
ఇక మిథున రాశి వారికి కూడా ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. వీరికి లాభదాయకమైన విధంగా పనులు ముందుకు వెళతాయి. మీన రాశి వారికి కూడా ఈ నెల ఎంతో ముఖ్యమైనది. ఆర్థికంగా లాభాలు రానున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఎంతో అనుకూలం. వేతనాల్లో పెరుగుదల ఉంటుంది. అధికారుల మెప్పు పొందుతారు. జీవిత భాగస్వామి సహకారంతో ఎంతటి కష్టాన్నైనా ఇట్టే దూరం చేసుకోవచ్చు. ఇలా పలు రకాల లాభాలు ఈ రాశుల వారిని సంతోషపరుస్తాయి. మార్చి నెలలో ఈ రాశుల వారికి ఎంతో మంచి కాలం అని గుర్తించుకోవాలి.