Single Life vs Married Life: జీవితం ఎలా ఉంటే బాగుంటుంది? ఒంటరిగా ఉంటే బాగుంటుందా? జంటగా ఉంటే బాగుంటుందా? ఒంటరిగా ఉంటే ఏకాకి లాగా బతకాలి. ఏ కాకి కూడా ఏకాకి కాదు కాబట్టి.. ప్రతి మనిషికి ఒక తోడు ఉండాలని.. మన పెద్దలు వివాహ వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. వెనకటి కాలం నుంచి వివాహ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. కాకపోతే కాలానికి తగ్గట్టుగా మారుతూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రజల లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో రకరకాల మార్పులు చోటుచేసుకున్నాయి.. అందువల్లే చాలామంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల కాలంలో ఒంటరిగా ఉండడం పెరిగిపోయింది. వివాహ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు, కట్టుబాట్లు, ఒత్తిళ్లు యువతను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. పైగా ఆర్థిక స్థిరత్వం అనేది పెరిగిన నేపథ్యంలో యువత పెళ్లి వైపు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇక ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల వల్ల వివాహ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా భర్తలు బాధితులుగా మిగిలిపోతున్నారు. దీంతో చాలామంది యువత పెళ్లికి దూరంగా ఉంటున్నారు.
Also Read: డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలుసా ?
సింగిల్ గా ఉండడం బెటరా, మింగిల్ అవ్వడం బెటరా అనే ప్రశ్నలు ఎదురైనప్పుడు.. మొదటిదానికే అవును అని జై కొడుతున్నారు నేటితరం. దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఓ అద్భుతమైన జలపాతం వద్దకు విహారయాత్రకు కొంతమంది వెళ్లారు. వారంతా కూడా యువకులు.. పైగా పెళ్లి కాని వారు. వారంతా అక్కడ జలపాతాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు. తమ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ సంబరపడుతున్నారు. వారి పక్కనే ఒక జంట ఆ జలపాతాన్ని చూసేందుకు వచ్చింది. జలపాతం అందాన్ని చూడకుండా వారిద్దరు గొడవ పడుతున్నారు. వాదులాడుకుంటున్నారు. ఇది నిజంగా జరిగిందా? కేవలం సోషల్ మీడియాలో రీల్స్ కోసమే చేశారా? అనే విషయాలను పక్కనపెడితే ఈ వీడియో నేటి కాలానికి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. పైగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
పెళ్లి అంటే నేటి తరానికి ఏవగింపు కలిగింది. అందువల్లే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. జంటలో ఆనందం ఉండదని.. ఒంటరిగా ఉంటేనే ఆ సంతోషం దక్కుతుందనే భావనలో ఉన్నారు. అందువల్లే ఇలా విహారయాత్రలకు వెళ్తున్నారు. పైగా సింగిల్ గా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండదు. మహా అయితే స్నేహితులు పెళ్లి గురించి అడుగుతుంటారు. బంధువులు పోరు పెడుతుంటారు. కన్న తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతుంటారు. కొంతకాలానికి వారు కూడా సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత నచ్చినట్టు జీవితాన్ని గడపవచ్చు. జిందగీ నా మిలే దోబార అన్నట్టుగా సాగిపోవచ్చని” సింగిల్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: కళ్ళు మూసుకున్నా.. నిద్ర పట్టడం లేదా? ఈ ఒక్క పని చేసి చూడండి..
వివాహం అంటే అన్నీ ఉంటాయి. సుఖంతోపాటు దుఃఖం ఉంటుంది. సంతోషంతోపాటు బాధ ఉంటుంది. ఆనందంతోపాటు ఆవేదన కూడా ఉంటుంది. ఇవన్నీ కలబోస్తేనే జీవితం అవుతుంది. వీటన్నిటినీ ఆస్వాదించకుండా.. ఒంటరిగా ఉండిపోతామంటే ఎలా కుదురుతుంది. ఒంటరిగా ఉంటే బాధలు ఎవరితో షేర్ చేసుకోవాలి. సంతోషాలు ఎవరితో పంచుకోవాలి.. ఆనందాలు ఎవరితో అనుభవించాలి.. ఒంటరిగా ఉండిపోవడం అంటే మనకు మనం శిక్ష వేసుకోవడమేనని” పెళ్లయినవారి వ్యాఖ్యానిస్తున్నారు. అటు పెళ్లికాని వారు, ఇటు పెళ్లయిన వారు తమ తమ అనుభవాలను చెబుతున్న నేపథ్యంలో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చర్చకు కారణమవుతోంది.