Single: ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పూర్వం రోజుల్లో అయితే అమ్మాయిలు తొందరగానే పెళ్లి చేసుకునే వారు. కానీ ఈ రోజుల్లో మాత్రం 30 ఏళ్లు వచ్చిన కూడా అమ్మాయిలు పెళ్లికి రెడీ కావడం లేదు. పెళ్లి ఏం లేకుండా ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడుతున్నారు. పెళ్లి చేసుకుని బాధపడే బదులు ఒంటరిగా ఉండటం మేలని భావిస్తున్నారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పెరుగుదల వంటి కారణాల వల్ల చాలా మంది అమ్మాయిలు అసలు పెళ్లి చేసుకోవడం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు చాలా మంది ఆడపిల్లలకు 20 నుంచి 30 ఏళ్లలోపు పెళ్లిళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు ఎన్ని ఏళ్లు అయిన కూడా పెళ్లిళ్లు జరగడం లేదు. అయితే వచ్చే ఆరేళ్లలో దాదాపుగా సగం మంది యువతులు పెళ్లి, పిల్లలు లేకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 25 నుంచి 44 ఏళ్ల మధ్య మహిళలు పెళ్లి, పిల్లలు లేకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారట. వచ్చే ఆరేళ్లకు ఇలా పెళ్లి, పిల్లలు లేని మహిళలు పెరుగుతారట.
మహిళలు ఇలా పెళ్లికి నిరాకరించడానికి ముఖ్య కారణం.. ప్రస్తుతం మారిన జనరేషన్. ప్రేమ లేదా పెద్దల కుదిర్చిన వివాహం చేసుకుంటున్నారు. పోని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నారా అంటే.. అదీ లేదు. పెళ్లి చేసుకోవడం, మళ్లీ ఒక ఏడాదికి విడాకులు తీసుకోవడం. ప్రస్తుతం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటివన్నీ యువత చూసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోంది. పెళ్లి చేసుకుని సంతోషంగా లేనప్పుడు ఇంకెందుకని ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అలాగే పెళ్లయిన తర్వాత ఫ్రీడమ్ ఉండదు. భాగస్వామి మాటలు వినాలి. వారి చెప్పినట్లే చేయాలి. ఉద్యోగం లేదా ఎక్కడికి వెళ్లాలన్నా కూడా అన్ని వారి ఇష్టం మీదే ఉండాలి. ఇలా స్వేచ్ఛ ఉండదని భావించి కొందరు పెళ్లికి నిరాకరిస్తున్నారు. ఒంటరిగా ఉంటూ.. జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. అలాగే జీవితంలో ఉన్నతంగా ఉండాలని భావిస్తున్నారు. పెళ్లి, పిల్లలు అయితే వాటికి అడ్డు అని భావించి కూడా కొందరు పెళ్లికి నిరాకరిస్తున్నారు. అలాగే పెళ్లయిన తర్వాత కూడా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో చాలామందికి ప్రేమ, పెళ్లి మీద రోజురోజుకీ నమ్మకం పోతుంది. దీనివల్ల కూడా యువత పెళ్లిని స్కిప్ చేస్తున్నారు.
ఈ జనరేషన్‌లో యువత ఎక్కువగా ఇండిపెండెంట్‌గా ఉండటంతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు. పెళ్లి వయస్సు వచ్చే సరికి లైఫ్‌లో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. వీటివల్ల కొందరు పెళ్లికి నిరాకరిస్తున్నారు. ఉదాహరణకు ఓ వ్యక్తికి నెలకు ఒక 20 వేల జీతం వస్తుందని అనుకోండి. తనకి పెళ్లి వయస్సు వచ్చిన తక్కువ జీతం అని కుటుంబానికి పోషించలేనని చేసుకోడు. ఇలా ఆలోచించి పెళ్లికి నో చెప్పిన వాళ్లు కూడా ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. డబ్బులు లేకపోతే అసలు ఈ రోజుల్లో ఏం చేయలేరు. డబ్బు ఉంటేనే భార్య లేదా కుటుంబం దగ్గర విలువ ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది కూడా డబ్బు ఉంటేనే చేసుకుంటున్నారు. యువత పెళ్లికి నిరాకరించడానికి ఇలాంటివి కూడా ఓ కారణమే.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.