Investment Plan: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరమే. వివిధ అవసరాలకు డబ్బును కాపాడుకోవాలి. సంపాదించిన సొమ్మును ఖర్చులకు వాడుకుని మిగతాది సేవింగ్స్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. దీంతో కొందరు బ్యాంకుల్లో, మరికొందరు చిట్టీలు వేస్తుంటారు. చిట్టీలు వేయడం ద్వారా బల్క్ అమౌంట్ ఒకేసారి వస్తుందని అనుకుంటారు. కానీ ఆ మొత్తానికి వడ్డీ చెల్లిస్తున్నారన్న విషయం చాలా మంది గ్రహించరు. ఇక చిట్టీలు నడిపేవారు, చిట్ ఫండ్ సంస్థలు చీటింగ్ చేయడంతో చాలా మంది ఇప్పుడు అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ అద్భుతమైన అవకాశం ఉంది. ఇందులో చిట్టీలు కట్టే బదులు ఇన్వెస్ట్ మెంట్ చేస్తే దిమ్మదిరిగే లాభాలు వస్తుంటాయి. అదెలాగంటే?
ఈమధ్య బాగా వినిపిస్తున్న పేరు (Simple Investment Plan) SIP. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల సేఫ్ గా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. అయితే లాంగ్ పీరియడ్ వారికి మాత్రమే ఇది బెస్ట్ ఆప్షన్. పైగా బ్యాంకులో ఇచ్చే వడ్డీని మాత్రమే చెల్లించడం ద్వారా చాలా మంది అనాసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో మ్యూచ్ వల్ ఫండ్ కు ప్రత్యామ్నాంగా ఆదరణ పొందుతోంది(Exchange Traded Fund) ETF.
మనదేశంలో కొంతకాలం నుంచి ఈటీఎఫ్ ఆదరణ పొందుతోంది. 2019 సెప్టెంబర్ 30 నాటికి ఈటీఎఫ్ వ్యాల్యూ రూ.1.47లక్షల కోట్లు. ఇది 2021 నాటికి రెండింతలు పెరిగి రూ.3.62 లక్షల కోట్లకు చేరుకుంది. సంపన్నులు, రిటైల్ రంగంలో ఇన్వెస్ట్ చేసేవారు సైతం ఇప్పుడు ఈటీఎఫ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా మార్కెట్ పొజిషన్ భట్టి వడ్డీ అధికంగా వస్తుంది. ఒకవేళ డౌన్ లో ఉంటే తక్కువ లాస్ కనిపిస్తుంది.
ETFలు ఒకరకంగా స్టాక్ మార్కెట్ లా పనిచేస్తాయి. ఇన్వెస్టర్ల నుంచి డబ్బును సేకరించి ఆ మొత్తంతో షేర్లు, డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తారు. ఇవి మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. స్టార్ మార్కెట్లోని కొన్ని ఈటీఎఫ్ బ్లాక్స్ కలిపి షేర్లలా వ్యవహరిస్తాయి. ట్రేడింగ్ సమయంలోనే వీటి క్రయ, విక్రయాలు సాగుతాయి. ఒక ఈటీఎఫ్ యూనిట్ వ్యాల్యూ దానిలోని షేర్లు, సెక్యూరిటీల విలువను భట్టి మారుతూ ఉంటుంది. ఇందులో ఈక్వీటీ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, డెట్ ఈటీఎఫ్, కరెన్సీ ఈటీఎఫ్ అనే రకాలు ఉంటాయి.
ఈటీఎప్ లో రిస్క్ తక్కువగా ఉంటుంది. కానీ వ్యక్తిగత పెట్టుబడిదారులకు ఇది మంచి ఎంపిక. ఇవి తక్కువ వ్యయ నిష్పత్తిని కలిగి ఉంటాయి. అయితే ఈటీఎఫ్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ప్రతీ నెల చివరి గురువారం ముందు అంటే బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలలోపు ఈటీఎఫ్ షేర్లను కొనుగోలు చేయాలి. ఇలా చేయడం వల్ల అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.