Sreeleela: లిప్ లాక్ సన్నివేశాలకు సిల్వర్ స్క్రీన్ పై ఓ క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ వీటిని ప్రత్యేకంగా చూస్తారు. బాలీవుడ్ లో ఇది కామన్ అయినా టాలీవుడ్ ఇంకా కొత్త ట్రెండే. పైగా బూతుగా భావిస్తారు. అర్జున్ రెడ్డి మూవీలో సందీప్ రెడ్డి వంగా ఘాడమైన లిప్ లాక్ సన్నివేశాలు తెరకెక్కించాడు. అప్పుడు మామూలు రాద్ధాంతం జరగలేదు. న్యూస్ ఛానల్స్ లో డిబేట్లు పెట్టారు. అయితే ఈ మధ్య కొన్ని సన్నివేశాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఉంటున్నాయి.
యంగ్ బ్యూటీ శ్రీలీలకు లిప్ లాక్ సన్నివేశాల్లో ఇంత వరకు నటించలేదు. మరో కన్నడ బ్యూటీ కృతి శెట్టి సైతం నటించారు. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో పాల్గొంటున్న శ్రీలీలకు ఈ లిప్ లాక్ సన్నివేశాల మీద ప్రశ్న ఎదురైంది. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తే… ఏ హీరోతో చేస్తారని అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు ఒకింత కంగారు పడ్డ శ్రీలీల అదిరిపోయే సమాధానం చెప్పింది.
నేను ఏ హీరోకి లిప్ కిస్ ఇవ్వను. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించను. అలాంటి సన్నివేశం చేయాల్సి వస్తే నా లిప్ కిస్ నా భర్తకే ఇస్తాను, అంది. శ్రీలీల తన మొదటి ముద్దు కట్టుకున్న వాడికే ఇస్తానని చెప్పి తప్పుకుంది. హీరోయిన్స్ డిమాండ్స్ వాళ్లకు ఫేమ్ ఉన్నంత వరకే… ఒకసారి పక్కన పడితే ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించడానికి రెడీ అంటారు. ఇది చాలా మంది హీరోయిన్స్ విషయంలో రుజువైంది.
ప్రస్తుతం శ్రీలీల మహేష్ కి జంటగా గుంటూరు కారం చేస్తుంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబోలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో కూడా శ్రీలీల హీరోయిన్. నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ చిత్రాల్లో శ్రీలీల నటిస్తుంది. ఆమె లేటెస్ట్ రిలీజ్ భగవంత్ కేసరి సక్సెస్ వైపు దూసుకెళుతుంది.