Silent behavior: సమాజంలో మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన మనస్తత్వం ఉంటుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్తత్వాలు పోలికలు ఉండవు. కానీ అయినా చాలామంది కలిసే ఉంటారు. కొంతమంది మాత్రం ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. ఇలా ఒంటరిగా ఉండేవాళ్ళు ఎప్పుడు సైలెంట్ గా ఉంటారు. కుటుంబ సభ్యుల్లో అయినా.. ఉద్యోగ, వ్యాపార సముదాల్లో అయినా కొందరు వ్యక్తులు ఎప్పుడూ కామ్ గా ఉంటూ ముందుకు సాగుతారు. వీరిని కొందరు నల్లి అని కూడా పిలుస్తారు. అంటే ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటూ చిన్నగా నవ్వే వారిని నమ్మొద్దు అని కూడా చెప్తారు. కానీ అలా వారి గురించి తప్పుగా ఆలోచించొద్దు. ఎందుకంటే సైలెంట్ గా ఉండే వారిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Also Read: కన్నతల్లి కన్నీటి పాఠం – మరచిన మానవత్వం
ప్రేమ
సైలెంట్ గా ఉండేవారు కొందరిని మాత్రమే ప్రేమిస్తారు. వీరు ఎక్కువగా కొత్త వారితో మాట్లాడడానికి ప్రయత్నించరు. అయితే వీరిపై ఎంత ప్రేమ చూపిస్తే అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు. కానీ వారు ప్రేమ చూపించాలంటే ఎదుటివారి నచ్చాలి. అప్పుడు వారు తప్పకుండా వారిని విడిచిపెట్టకుండా ఉంటారు.
స్నేహితులు
కామ్ గా ఉండేవారు తక్కువ మందితో స్నేహం చేస్తారు. ఎందుకంటే తమ స్నేహం స్వచ్ఛమైనదిగా ఉండాలని అనుకుంటారు. తాము స్నేహం చేస్తే ఎదుటివారు మోసం చేయొద్దు అని భావిస్తారు. అయితే ఎవరు మోసం చేస్తారో నాని భయపడి వీళ్ళు ఎక్కువగా స్నేహం చేయకుండా ఉంటారు. అయితే ఒక్కసారి స్నేహం చేస్తే మాత్రం విడిచిపెట్టకుండా జీవితాంతం కొనసాగిస్తారు.
నవ్వు
సైలెంట్ గా ఏం మాట్లాడకుండా ఉండేవారు తక్కువగా నవ్వుతారు. కానీ వీరు ఎప్పుడైనా నవ్వితే చాలా అందంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడూ నవ్వే వారి కంటే తక్కువగా నవ్వే వారు చాలా అందంగా కనిపిస్తారు.
ఫైనాన్స్
ఈ రకమైన లక్షణం ఉన్నవారు ఆర్థిక వ్యవహారాల్లో చాలా పకడ్బందీగా ఉంటారు. వీరితో డబ్బు వ్యాపారం జరిపే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తమది కానీ డబ్బును వారు అస్సలు విడిచిపెట్టారు. అంతేకాకుండా ఎక్కువ డబ్బు తీసుకోకుండా ఉంటారు. ఎందుకంటే తమది కానీ డబ్బులు తీసుకుంటే ఎదుటివారి నుంచి మాట పడాల్సి ఉంటుంది అని అనుకుంటారు. అందువల్ల ఆ మాట పడకుండా జాగ్రత్త పడతారు.
కమ్యూనికేషన్
సాధారణంగానే వీరికి కమ్యూనికేషన్ తక్కువగా ఉంటుంది. అయితే కమ్యూనికేషన్ తక్కువగా ఉండడానికి ఒక కారణం ఉంది. కొత్త వారితో మాట్లాడితే ఏమైనా తప్పు చేస్తామో అన్న భయం ఉంటుంది. ఈ క్రమంలో వారు కొత్త విషయాలు కొత్తవారితో మాట్లాడకుండా ఉంటారు. అయితే వీరిని మాట్లాడించి స్నేహం చేస్తే తప్ప వారు తమ విషయాలను బయట పెట్టరు.
Also Read: గ్రీన్ టీ తాగేవాళ్లు, తాగని వారు ఇది తెలుసుకోవాలి.. లేకుంటే డేంజర్లో పడుతారు
వ్యక్తిగత విషయాలు
సైలెంట్ గా ఉండే వారి వ్యక్తిగత విషయాలు దాదాపు ఎవరికీ చెప్పరు. వారు తమ ప్రాణ స్నేహితుడు అని లేదా తమకు దగ్గర వారు అనుకుంటే మాత్రమే చెబుతారు. వీరి వద్ద నుంచి కొత్త విషయాలు లాగడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. అయితే వారితో స్నేహం చేస్తే మాత్రం తప్పకుండా చెప్పగలుగుతారు.