Suryakumar Yadav: బీసీసీఐ వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును ఖరారు చేసే పనిలో పడింది. దీంతో ఆటగాళ్ల ఎంపికకు కసరత్తు ప్రారంభించింది. 2011లో గెలిచిన వరల్డ్ కప్ తరువాత మళ్లీ మనకు కప్ రాలేదు. ఈసారి కప్ గెలవాలనే దృఢ సంకల్పంతో యాజమాన్యం ఆటగాళ్లను ఎంపిక చేస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా పరుగులు రాబట్టే వారిని పక్కన పెట్టేయాల్సి వస్తోంది. ఈ సీజన్ లో మంచి ప్రదర్శనతో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్ కే జట్టులో అవకాశం లేకుండా చేస్తున్నారు. దీంతో జట్టు రాణించడం కష్టంగా మారనుంది.

ప్రపంచ కప్ కు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉండటంతో ఆటగాళ్లను సానబెట్టాలని బీసీసీఐ చూస్తోంది. ఈ మేరకు పనికొచ్చే వారిని గుర్తించే పనిలో పడింది. జట్టు కూర్పులో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రదర్శనలో మేటిగా ఉన్న వారిని ఎంపిక చేయాలని కృతనిశ్చయంతో ఉంది.
సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్ లో 908 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. గతేడాది టీ20 క్రికెట్ లో మెరుగైన ప్రదర్శన చూపించాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ కు ఎంపిక చేసినా వన్డే వరల్డ్ కప్ కు మాత్రం అతడిని ఎంపిక చేయడం అనుమానంగా ఉందని చెబుతున్నారు. దీంతో స్టార్ క్రికెటర్ ను పక్కన పెడితే పరుగులు సాధించడం కష్టమే. దీంతో సూర్యకుమార్ యాదవ్ ను కచ్చితంగా ఎంపిక చేయాల్సి ఉన్నా అది కుదరదేమోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి.

కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అతడి ఎంపికపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కూడా ఓ కారణం ఉంది. జట్టులో శ్రేయాస్ అయ్యర్ కూడా మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. పైగా అతడు వికెట్ కీపర్ కావడంతో అతడి కోసం సూర్యకుమార్ యాదవ్ ను పక్కన పెడతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కు సూర్యకుమార్ యాదవ్ ను కాదనుకుంటారా? లేక జట్టులో చేర్చుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది. సూర్యకుమార్ యాదవ్ కీపర్ కాకపోవడంతోనే అతడికి జట్టులో స్థానం దక్కకపోతుందని చెబుతున్నారు.