Veera Simha Reddy- Waltair Veerayya: సినిమా ఓ దృశ్య కావ్యం.. దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఎంతో మంది కష్టపడతారు.. ఇందులో కులాలు, గిలాలు ఏవీ ఉండవు.. పచ్చ మీడియా మాత్రం సినిమాలకు కులాల రంగులు అదే ప్రయత్నం చేస్తోంది.. కొట్టుకు తన్నేలా డిబేట్లు నిర్వహిస్తోంది.

ఇవాళ కొత్తా?
సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఇవాళ కొత్తగా విడుదల కావడం లేదు.. ఒకసారి ఒకరు విజేతగా నిలిస్తే, మరొకసారి ఇంకొకరు విజేతగా నిలిచారు.. కానీ ఈసారి కొత్తగా వారిద్దరి సినిమాలు విడుదలవుతున్నట్టు పచ్చ మీడియా రంకెలు వేస్తోంది. వాటిని కమ్మ, వర్సెస్ కాపు యుద్ధంగా పచ్చ మీడియా చిత్రీకరించడం దారుణానికే దారుణం. వాస్తవానికి సినిమాలో సరుకు ఉంటే ఎవరు ఏం చేసినా దాని విజయాన్ని ఆపలేరు.. ఉదాహరణకు కాంతారా సినిమాను తీసుకుంటే… దానికి మన నేటివీటితో సంబంధమే లేదు.. అయినప్పటికీ భారతదేశ వ్యాప్తంగా ఘనవిజయం సాధించింది.. తెలుగు నాటకూడా భారీ వసూళ్లు సాధించింది. అలాంటి సినిమాకు మనం కులాల వంక పెట్టగలమా? అక్కడిదాకా ఎందుకు 1971లో సంక్రాంతికి సీనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణ విజయం, ఏఎన్ఆర్ దసరా బుల్లోడు విడుదలయ్యాయి.. కానీ దసరా బుల్లోడు మాత్రమే విజయం సాధించింది. దీంతో ఆంధ్రలో గొడవలు జరిగాయి. ఆ తర్వాత కూడా ఎంతోమంది అగ్ర హీరో సినిమాలో ఒకేసారి విడుదలయ్యాయి. ఒక హీరో ది హిట్. ఇంకొక హీరోది ప్లాప్ అయ్యేవి.ఇది చాలా కామన్.. ఇదంతా కూడా కొత్తగా జరుగుతున్నట్టు, రెండు కులాల మధ్య కుంపట్లు రగిల్చేందుకు ఎల్లో మీడియా కుట్ర చేయడం పతనం అవుతున్న పాత్రికేయానికి పరాకాష్ట.

అందరూ ఆదరిస్తేనే
వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సంక్రాంతి కి వచ్చాయి.. వీరిద్దరి సినిమాలు అన్ని కులాల వాలు ఆదరిస్తేనే ఇంతకాలం ఆడాయి.. ఇకముందు ఆడతాయి. అభిమానానికి కులం ఏముంటుంది? మతం ఏముంటుంది? ఇప్పుడు కొత్తగా బాలయ్య కమ్మ, చిరంజీవి కాపుగా మార్చి గొడవలు పెట్టేందుకు పచ్చ మీడియా వేస్తున్న రంకెలు అన్నీ ఇన్ని కావు.. సినిమాలో విషయం లేకపోతే 100 యూట్యూబ్ చానల్స్ లో కేకలు వేసినా, సమీక్షల్లో జాకీ లు పెట్టి లేపినా ఉపయోగం ఉండదు. ఈ ఈ విషయాన్ని తెలుసుకోలేని పచ్చ మీడియా పాత్రికేయాన్ని వీధి కొళాయిల గొడవ స్థాయికి దిగజార్చడం పతనమవుతున్న విలువలకు పరాకాష్ట.