https://oktelugu.com/

Marriage: మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదా?

ప్రేమ పెళ్లి లో ఇది జరగడం లేదు కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లి లో మాత్రం ఇప్పటికీ జాతకాలు చూస్తుంటారు. ఇక మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అంటారు కొందరు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 5, 2024 / 10:02 AM IST

    moola nakshatra female

    Follow us on

    Marriage: పెళ్లి అనే బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఈ రోజుల్లో పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదు. వధూవరులకు ఇద్దరు నచ్చాలి. ఆ తర్వాత పెళ్లి. ఇక పెళ్లి ఖర్చులు అంటారా? వామ్మో తడిసి మోపెడు అవుతాయి. అమ్మాయి తరుపు వారు అయితే అప్పుల పాలు కావాల్సిందే. ఇదంతా పక్కన పెడితే ముహుర్తాలు, జాతకాలు చూడనిదే ఎవరు పెళ్లి చేసుకోరు. కచ్చితంగా వధూవరుల జాతకాలు కలవాల్సిందే. లేదంటే పెళ్లి క్యాన్సిల్ కూడా చేస్తారు. అందుకే ముందే అన్నీ విషయాలు చర్చించుకుంటారు.

    ఇక ప్రేమ పెళ్లి లో ఇది జరగడం లేదు కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లి లో మాత్రం ఇప్పటికీ జాతకాలు చూస్తుంటారు. ఇక మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అంటారు కొందరు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయని నమ్ముతుంటారు. మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దా? చేసుకుంటే సమస్యలు వస్తాయా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    శాస్త్ర పరంగా చూస్తే ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫుల్ లక్ అంటున్నారు పండితులు. కానీ చాలా మంది మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అని, అలా చేసుకుంటే చిక్కుల్లో పడాల్సిందే అంటారు. అయితే ఇవన్నీ అపోహలేనట. నిజానికి అలాంటివి జరగవు. ఒకవేళ ఇదే నిజం అయితే అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి సమస్యలు రావాలి. పైగా పుట్టిన వాళ్లకు కూడా అమ్మాయి వల్ల సమస్యలు రావాలి.

    మరి అలాంటివి ఏం జరగనప్పుడు కేవలం పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే సమస్యలు వస్తాయి అనడం ఎంతవరకు కరెక్ట్. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిల్లో బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ లెక్క ప్రకారం వారు ఇబ్బందులు పడాలి కానీ మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేయకూడదు కదా. మరో విషయం మూల నక్షత్రంలో పుట్టి పెళ్లి చేసుకున్నవారు సంతోషంగా ఉన్న వారు చాలా మంది ఉన్నారు. అందుకే ఇలాంటి వాటిని గుడ్డిగా నమ్మకండి అంటారు కొందరు.