Rice and Chapati: మనలో చాలామంది రోటీ, అన్నం కలిపి తినడానికి ఇష్టపడతారు. రొట్టె, అన్నం కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చాలామంది భావిస్తారు. అయితే కొంతమంది మాత్రం రోటీ, అన్నంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటినీ కలిపి తినకూడదని భావిస్తారు. ఒకే సమయంలో రెండూ తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటారు.

అయితే రొట్టె, అన్నం ఒకే సమయంలో తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావు. రోటీ, అన్నంలో ఒకే విధమైన ధాన్యం, కేలరీలు ఉంటాయి. అయితే ఒకే సమయంలో వీటిని తీసుకోకుండా గ్యాప్ ఉండాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒకే సమయంలో రెండు ఆహారాలను తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ సూచించే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ ఆహారాలు ఒకే సమయంలో తీసుకుంటే ఉబ్బరం సమస్య వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
ఒకవేళ రెండింటినీ తీసుకోవాలని భావించే వాళ్లు మొదట రోటీ తీసుకుని ఆ తర్వాత అన్నం తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. చపాతీ, రోటీలలో ఫైబర్, ప్రాథినియెన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా వెంటనే ఆకలి వేయదు. బరువు తగ్గాలని భావించే వాళ్లు రాత్రి సమయంలో రోటీని తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. రోటీతో పాటు పప్పు, కూరగాయలు, పెరుగు తీసుకుంటే మంచిది.
రైస్ లో పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి సులభంగా లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ లో పాలీష్‌డ్ బియ్యం ఉన్నాయి. ఈ బియ్యం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. అన్నంతో పోలిస్తే చపాతీలో కేలరీలు తక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే.