Telugu Actors: సినీ పరిశ్రమ పరిస్థితి ఒకప్పుడు వేరు. ఇప్పుడు వేరు. మార్కెట్ విస్తృతి భారీగా పెరిగిపోయింది. థియేటర్ తో పాటు ఓటీటీ, డబ్బింగ్, శాటిలైట్, ఆడియో అంటూ.. ఆదాయం పెరిగింది. దీంతో మార్కెట్ ఎక్కువగా ఉన్న బడా హీరోలు.. రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు. మరి, తెలుగులో టాప్ హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అన్నది చూద్దాం.

ప్రభాస్: ప్రభాస్ కెరియర్ ను బాహుబలికి ముందు.. ఆ తర్వాత అని వేరు చేయొచ్చు. అంతకు ముందు అందరిలో ఒకడుగా ఉన్న ప్రభాస్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. హిందీలో మనోడికి భారీగా మార్కెట్ పెరిగింది. అందుకే ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. అందువల్ల సినిమాకు వంద కోట్ల వరకు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
Maha samudram movie Twitter Review : “మహా సముద్రం” ట్విట్టర్ రివ్యూ..
పవన్ కల్యాణ్: టాలీవుడ్ లో పవర్ స్టార్ రేంజ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ పాన్ ఇండియా సినిమా చేయలేదు. అయినా.. ఆయన రెమ్యునరేషన్ అగ్రస్థానంలో ఉంది. వకీల్ సాబ్ కోసం 60 కోట్లు తీసుకున్నట్టు టాక్. హరిహర వీరమల్లు చిత్రానికి 65 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.
మహేష్ బాబు : మరో స్టార్ మహేష్ బాబు కూడా గట్టిగానే చార్జ్ చేస్తున్నాడు. ఆయన ప్రతీ సినిమాకు లాభాల్లో వాటా తీసుకుంటాడు. ఆ విధంగా.. భారీగానే ముడుతుంది. సర్కారు వారి పాటకు 60 కోట్ల వరకు తీసుకుంటున్నడని తెలుస్తోంది.
ఎన్టీఆర్ : యంగ్ టైగర్ పారితోషికం విషయంలో కాస్త రీజనబుల్ గానే ఉన్నాడు. త్రిపుల్ ఆర్ సినిమాకోసం 45 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. అది కూడా మూడేళ్ల డేట్స్ ఇచ్చాడు కాబట్టి అంత తీసుకుంటున్నాడని సమాచారం.
రాం చరణ్ : చెర్రీ కూడా త్రిపుల్ ఆర్ సినిమాకు 45 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్. రాం చరన్ కూడా మూడేళ్ళ డేట్స్ ఇచ్చేశాడు. అయితే.. శంకర్ తో తీయబోయే సినిమాకు మాత్రం 60 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్: పుష్ప సినిమాకు అల్లు అర్జున్ 60 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. అంటే.. రెండు సినిమాలకు కలిపి ఈ పారితోషికం అనుకోవచ్చు.
మెగాస్టార్: టాలీవుడ్ రెమ్యునరేషన్ విషయంలో మెగాస్టార్ ది సెపరేట్ కేటగిరి. ఆయన మార్కెట్ పరంగా పారితోషికం ఫిక్స్డ్ గా ఉంటుంది. మిగిలిన సీనియర్ హీరోలు 7, 8 కోట్లు మాత్రమే తీసుకుంటారు. కానీ చిరు మాత్రం గట్టిగానే తీసుకుంటాడు. ఆచార్య సినిమాకు 50 కోట్ల వరకు ఆయన షేర్ ఉంటుందని టాక్.
Also Read: Maha samudram movie Twitter Review : “మహా సముద్రం” ట్విట్టర్ రివ్యూ..
బాలయ్య: బాలకృష్ణ అఖండ సినిమాకోసం 10 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్. గతంలో 8 కోట్ల మేర తీసుకున్నా.. ఇప్పుడు పది డిమాండ్ చేసినట్టు సమాచారం.
నాగార్జున: నాగార్జున కూడా ఒక్కో సినిమాకు 7 కోట్ల మేర తీసుకుంటాడు. రాబోయే సినిమాలకు కూడా ఇలాగే తీసుకుంటున్నాడని టాక్.
Also Read: Actor Nani: ఫ్యాన్స్ కు సర్ప్రైస్ ఇచ్చిన… నేచురల్ స్టార్ నాని ?
వెంకీ: విక్టరీ బ్రాండ్ హీరో వెంకటేష్ కూడా.. ఒక్కో సినిమాకు 7 కోట్లు తీసుకుంటాడు. ఇదే పారితోషికం కంటిన్యూ చేస్తున్నట్టు టాక్.