https://oktelugu.com/

2021 Roundup: ఆటో మొబైల్ రంగంలో ‘చిప్స్’ కొరత.. తగ్గిన టూ, ఫోర్ వీలర్ అమ్మకాలు..

2021 Roundup: కరోనా మహమ్మారి దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఫలితంగా 2020-21 మధ్య ఆటోరంగంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టిన క్రమంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఓ వైపు కరోనా నుంచి తమను, ఫ్యామిలీని రక్షించుకునేందుకు చాలా మంది సొంత వాహనం కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. కారు కొనేందుకు షోరూం వెళితే అక్కడి డీలర్లు కస్టమర్లకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. కార్ల […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 28, 2021 / 12:28 PM IST
    Follow us on

    2021 Roundup: కరోనా మహమ్మారి దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఫలితంగా 2020-21 మధ్య ఆటోరంగంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టిన క్రమంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఓ వైపు కరోనా నుంచి తమను, ఫ్యామిలీని రక్షించుకునేందుకు చాలా మంది సొంత వాహనం కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. కారు కొనేందుకు షోరూం వెళితే అక్కడి డీలర్లు కస్టమర్లకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. కార్ల తయారీ కంపెనీలు సెమీకండక్టర్స్, చిప్‌ల కొరతను ఎదుర్కోవడం వలన మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ విక్రయాలు జరగలేదు. ఇప్పుడు కారు అడ్వాన్స్ బుక్ చేస్తే 2 నుంచి 3నెలల తర్వాత డెలివరీ ఇస్తామని షోరూం వాళ్లు చెప్పడంతో కస్టమర్లు కంగుతున్నారు.

    2021 Roundup

    పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈవీకి ఫుల్ డిమాండ్

    కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో జనాలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యావరణ హితం కోసం ఈవీ వెహికిల్స్ వాడే వారికి సబ్సిడీ ఇస్తామని ప్రకటించడంతో జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. అదే టైంలో టూ వీలర్ నుంచి ‘ఓలా‘, ’హీరో’ కంపెనీలు చార్జింగ్ బైకులను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాయి. చాలా మంది ఓలా బైకులను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఇక కార్ల విభాగంలో టాటా, ఎంజీ మోటార్స్, హ్యుండాయ్‌తో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేశాయి. కానీ మార్కెట్లో టాటా ‘నెక్సాన్’, ‘టిగార్’, ‘ఎంజీ మోటార్స్’ విద్యుత్ వాహనాలు ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్నాయి.

    పండుగ టైంలో ఆటోరంగం కుదేలు..

    కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది వాహన అమ్మకాలు భారీగా పడిపోయాయి. అందుకు కారణం ప్రధానంగా సెమీకండక్టర్స్ అండ్ చిప్స్ కోరత అని తెలిసింది. మార్కెట్లో వాహనాలకు డిమాండ్ ఉన్నా అనుకున్నంత సరఫరా జరగలేదు. ఫలితంగా దసరా, దీపావళి టైంలో కేవలం 20,90,893 కార్లను పలు కంపెనీలు విక్రయించాయి. 2020లో సరిగ్గా ఇదే సీజన్‌లో 25,56,335 కార్లు డీలర్లు విక్రయించారు. మొత్తంగా ఈ ఏడాది 26 శాతం ప్యాసింజర్స్ వాహనాలు, 18శాతం టూవీలర్స్ అమ్మకాలు తగ్గాయి.

    Also Read: ఈ వైపు వీధిపోటు ఉంటే ఇంటి యజమానికి మరణ గండం..!

    ఈవీకి కేంద్రం బూస్టప్ :

    అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న ఆటో రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం సెప్టెంబర్‌లో కేంద్రం రూ.26,058 కోట్లతో పీఎల్‌ఐ స్కీం కింద ప్రోత్సహకాలు ప్రకటించింది.2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల వ్యవధిలో పీఎల్‌ఐ స్కీం ద్వారా 7.5లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని కేంద్రం అంచనా వేసింది. చిప్ మరియు సెమీ కండక్టర్లను తయారీని ప్రోత్సహించేలా డిసెంబర్ నెలలో 76వేల కోట్లను సమీప భవిష్యత్‌లో ఖర్చుచేసేందుకు కేంద్రం సిద్దపడింది. కేంద్రం చర్యలతో ఆటోరంగం తిరిగి వృద్ధి బాటలో నడుస్తుందని ఆటోరంగం నిపుణులు చెబుతున్నారు.

    Also Read: హెచ్‌డీఎఫ్‌సీ సూపర్ స్కీమ్.. ప్రీమియం కడితే సంవత్సరానికి రూ.2.8 లక్షలు!

    Tags