EMI BURDEN: దేశంలో ప్రతి వారు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకుని ఈఎంఐలు కడుతున్నారు. రిజర్వ్ బ్యాంకు రెపో రేట్లు పెంచడంతో వినియోగదారులకు చుక్కలు కనిపించనున్నాయి. ఇలా ప్రతి సారి ఆర్బీఐ రెపో రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుడు కుదేలవ్వాల్సిందే. తీసుకున్న రుణానికి మనం చెల్లించే వడ్డీలు పెరగనున్నాయి. దీంత నెలవారీ ఖర్చులు ఎక్కువవుతాయి. రిజర్వ్ బ్యాంకు నిర్వాకంతో ప్రతి పేదవాడికి భారం కానుంది. ఇదివరకు ఉన్న రెపో రేటు 5.40 శాతం నుంచి 5.90 శాతానికి పెరగనుంది. గతేడాదే ఆర్బీఐ రెపో రేటు పెంచినా మళ్లీ ఇప్పుడు పెంచడంతో వినియోగదారుల జేబులు గుల్ల కానున్నాయి.

రెపో రేటు పెంచడం ఇది నాలుగోసారి. దీంతో గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు. నెలనెల చెల్లించే ఈఎంఐ చెల్లించడానికి ఇక వ్యయం పెరగనుంది. ఈ నేపథ్యంలో తీసుకున్న రుణాలు చెల్లించడంలో మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం వడ్డీ పెరుగుతుంది. అసలు, మొత్తం చెల్లించడానికి ఇంకా సమయం పెరిగే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు మరింత ఇబ్బందులు రానున్నాయని పలువురు చెబుతున్నారు.
ఆర్బీఐ పెంచిన రెపోరేట్లు రేపో మాపో అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల బ్యాంకుల్లో తీసుకున్న రుణాలపై అధిక వడ్డీ పడనుంది. ఇప్పటికే ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్న ప్రజలకు నెత్తిన తాటిపండు పడినట్లే. రుణాలకు సంబంధించిన వడ్డీ భారం ఎక్కువ అవుతుంది. ఫలితంగా కట్టే వాయిదాలు పెరుగుతాయి. ఇదంతా ప్రభుత్వానికే లాభం కానుంది. ప్రస్తుతం వడ్డీ రేటు ఎంత పెంచనున్నారో కూడా తెలియడం లేదు. మొత్తానికి వినియోగదారులపై భారం మాత్రం పడుతుందనడంలో సందేహం లేదు.

రెపో రేటు తర్వాత ఈఎంఐలపై భారం వేస్తారు. మనం తీసుకున్న రుణాలకు వడ్డీ రేటు నిర్ణయించి అమలు చేస్తారు. రెపో రేటు పెరిగినా, తగ్గినా ఫిక్స్ డ్ రేట్ లోన్లపై మాత్రం ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు. మిగతా రుణాలకు సంబంధించిన ఈఎంఐలపై మాత్రం భారం కచ్చితంగా పడనుంది. దీంతో రెపోరేటు ప్రజలపై ఎంతో కొంత భారం మాత్రం వేస్తోంది. ఇప్పటికే వడ్డీలు కడుతున్న వారికి ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు ఇలా ఎడాపెడా రెపో రేటు పెంచడంతో అందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.