Chiranjeevi- Koratala Shiva: చిరంజీవి నటించిన ఆచార్య ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. కానీ చిరంజీవి మాత్రం కుంగిపోలేదు. విజయం దక్కినప్పుడు పొంగిపోవడం అపజయం కలిగినప్పుడు బాధ పడటం మానేశారు. దీంతో ఆచార్య విజయం సాధించకపోయినా చిరు మాత్రం ఏ మాత్రం విచారం వ్యక్తం చేయలేదు. కానీ తాను రాంచరణ్ కలిసి నటించిన సినిమా డిజాస్టర్ కావడం కొంత ఇబ్బంది అనిపించిందని అన్నారు. భవిష్యత్ తో తాము నటించిన సినిమాలపై కూడా ఇలాంటి ప్రభావమే పడుతుందనే భావం వ్యక్తం చేయడం గమనార్హం.

దర్శకుడు కొరటాల శివ మీద ఉన్న నమ్మకంతో ముందడుగు వేశాం. కానీ మా అంచనాలు ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. కానీ విడుదలయ్యాక మాత్రం అందరిలో నైరాశ్యమే మిగిలింది. గడిచిన పదిహేనేళ్లలో ఎన్నో విషయాలు ఎదుర్కొన్నారు. అన్నింటికి శారీరకంగా, మానసికంగా తట్టుకునేందుకు సంసిద్ధులయ్యారు. పరిణతి చెందిన నటుడిగా పరాజయాలు నన్నెప్పుడు బాధించలేదని గుర్తు చేశారు. గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
దర్శకుడు చెప్పిందే చేశాం తప్ప మన చేతుల్లో ఏముంటుంది. డైరెక్టర్ సూచన మేరకు మనం నటిస్తాం. హిట్టవడం, ఫట్టవడం మన చేతుల్లో లేదు. దర్శకులను నమ్ముకుని పనిచేస్తాం. అంతేకాని మనకు ఏ విషయంలో కూడా స్వేచ్ఛ ఉండదు. ఆచార్య పరాజయం మాత్రం తనకు ఏ మాత్రం బాధించలేదని పేర్కొన్నారు. అంతకు మించి ఎలాంటి బాధ లేదని చిరు వివరించారు. ఆచార్య ఎంతో హిట్టవుతుందని అనుకున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. దీనికి ఎలాంటి చింత లేదు. భవిష్యత్ లో అలాంటి పరాజయాలు దక్కకూడదనే కోరుకుంటున్నాం.

గాడ్ ఫాదర్ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్ గా సిద్ధమవుతోంది. ఇందులో చిరు అన్ని అస్త్రాలు పెట్టారు. దర్శకుడు మోహన్ రాజా తనదైన శైలిలో చిత్రాన్ని తెరకెక్కించారు సల్మాన్ ఖాన్ ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మొత్తానికి సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా విజయంపై అందరికి విశ్వాసం కలుగుతోంది. గాడ్ ఫాదర్ తో చిరు మరోసారి తన జైత్రయాత్ర కొనసాగిస్తారని ఆశిస్తున్నారు.