Personal Things: మనం జీవితంలో కొన్ని పొరపాట్ల చేయకూడదు. కొన్ని విషయాలను ఇతరులతో పంచుకోకూడదు. ఎంతటి స్నేహితుడైనా మన ఇంటి విషయాలు చెప్పకూడదు. ఇంట్లో విషయం గడప, ఊరు విషయం పొలుమారు దాటకూడదంటారు. కానీ అందరు తమకు ఏదైనా చిన్న విషయంలో పొరపాటు జరిగినా దాన్ని పది మంది ముందు ఏకరువు పెడతారు. వాటిని బాధ్యుడిని చేస్తూ అసత్య ప్రచారం చేస్తుంటారు.
మనిషి జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఎప్పుడు కూడా ఇతరులతో పంచుకోకూడదు. మన భార్య విషయం ఎప్పుడు కూడా బయట చెప్పకూడదు. మనం ఏదైనా మంత్రం చదువుతున్నా అది ఇతరులకు ఎప్పుడు కూడాచెప్పకూడదు. దాదాపు తొమ్మిది విషయాలు ఇతరులతో చెప్పకూడదని మన పెద్దలు చెప్పడం గమనార్హం.
మనం వేసుకునే మందులు కూడా ఇతరులకు చెప్పొద్దు. ఈ నేపథ్యంలో ఇంటి గుట్టు ఎప్పుడు బహిర్గతం చేయకూడదు. ఇంటి విషయాలు వేరే వారితో పంచుకోవద్దు. అలా చేస్తే చులకనకు గురవుతాం. మనకు కలిగే అవమానాలు కూడా ఇతరులకు చెప్పకూడదు. ఒకవేళ చెబితే ఏదైనా సమయం వచ్చినప్పుడు వాటిని ఇతరులకు చెబుతుంటారు.
జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎప్పుడు కూడా ఎవరితోనూ చెప్పుకోవద్దు. అలా చేసినా మనం చులకన అయిపోతుంటాం. దృఢమైన సంకల్పంతో ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురీదాలి. కానీ ఇతరులతో చెప్పుకుని ఊరట పొందితే అదే భవిష్యత్ లో మీకు అడ్డంకులను సృష్టించవచ్చు. అందుకే మనం జాగ్రత్తగా ఉండటమే శ్రేయస్కరంగా ప్రముఖులు చెబుతున్నారు.