Nayantara : సౌత్ ఇండియా లో ఒక స్టార్ హీరో కి ఉండాల్సిన ఫేమ్,మార్కెట్ ఉన్న హీరోయిన్ నయనతార. ఈ స్థాయి అంత తేలికగా రాదు. ఏడాదికి ఎంతోమంది కొత్త హీరోయిన్లు ఇతర రాష్ట్రాలనుండి దిగుమతి అవుతూ ఉంటారు. దర్శక నిర్మాతల చూపు వాళ్ళ మీదనే ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నయనతార కి డిమాండ్ చెక్కు చెదరలేదంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పైగా ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీ లెవెల్ లోనే డిమాండ్ చేస్తుంది. సాధారణంగా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ ని పట్టించుకోరు. వాళ్ళకంటే కొత్త హీరోయిన్స్ ని తీసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు మేకర్స్. కానీ నయనతార విషయంలో మాత్రం అలాంటివి చూడరు. ఆమె డేట్స్ ఇస్తే చాలు అనుకునే దర్శక నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే కేవలం ఆమె కోసం థియేటర్స్ కి కదిలి వచ్చే ఆడియన్స్ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అలాంటి నయనతార పబ్లిక్ ప్రాంతాల్లోకి వస్తే జన సందోహం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, రీసెంట్ గానే ఆమె తన భర్త సతీష్ విగ్నేష్ తో కలిసి ఢిల్లీ లోని ఒక రెస్టారంట్ కి వెళ్ళింది. జనాలు ఆ రెస్టారంట్ లో సీటింగ్ కోసం క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడి ఉన్నారు. ఆ క్యూ లైన్ లో నయనతార, ఆమె భర్త కూడా ఉన్నారు. సుమారు అరగంట పాటు వీళ్లిద్దరు నిల్చొని, ఆ తర్వాత ఒక డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తింటున్నారు. జనాలు వీళ్లిద్దరు ఉన్నారు అనే విషయాన్నీ అసలు పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. నయనతార నార్త్ ఇండియా లో కూడా బాగా పాపులర్. ఆమె నటించిన అనేక సినిమాలు హిందీ లో డబ్ అయ్యాయి. వాటికి యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
అంతే కాకుండా ఈమె షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సుమారుగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నయనతార కి కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. అయినప్పటికీ కూడా ఆమెను అక్కడి ఆడియన్స్ పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే సెలబ్రిటీస్ ని నార్త్ ఇండియాలో అనేక పబ్లిక్ ప్రాంతాల్లో ఆడియన్స్ పట్టించుకోరని అందరూ అంటూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత సినిమా పిచ్చి అక్కడి ఆడియన్స్ కి లేదు. నయనతార ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో ఎదో ఒక హోటల్లో దిగి లంచ్ కానీ, డిన్నర్ కానీ చేస్తే ఏ రేంజ్ లో జనాలు గుమ్మిగూడుతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటిది నార్త్ ఇండియా లో ఈమెని జనాలు పట్టించుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.