Mobile Addiction:ఒకప్పుడు జీవితం సాధారణంగా ఉండేది. ఒకరితో ఒకరు మాట్లాడాలనుకుంటే వారిని నేరుగా కలిసేవారు. వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే మార్కెట్ కి వెళ్లి డబ్బులు ఇచ్చి కొనుక్కునేవారు. సమయాన్ని చూసుకోవాలి అనుకుంటే చేతికి గడియారాన్ని ధరించేవారు. కానీ ఇప్పుడు ఇవన్నీ అరచేతిలోనే అందుబాటులో ఉంటున్నాయి. అందుకు కారణం మొబైల్. ఇది అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మారిపోయింది. ప్రతి ఒక్క పనిని ఫోన్ తోనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరకంగా మొబైల్ తోనే కొందరి జీవితం కూడా సాగుతుంది. మొబైల్ తోనే వ్యాపారం చేస్తున్నారు.. మొబైల్ తోనే ఉద్యోగం చేస్తున్నారు.. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న మొబైల్ ను మెచ్చుకోవాలా? లేదా జీవితాన్ని నాశనం చేస్తుందని అనుకోవాలా?
Also Read: పాత కారు అమ్ముతున్నారా? ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మంచి రేటు వస్తుంది
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కొందరు నిపుణులు చెబుతున్న ప్రకారం ఒక మనిషి కథనానికి కారణం మొబైల్ అని అంటున్నారు. పైన చెప్పిన దాని ప్రకారం వ్యక్తి అభివృద్ధికి ఫోన్ ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. కానీ పతనానికి ఏం చేసింది? ఇటీవల ఒక సినీ ఫంక్షన్లో అక్కినేని నాగార్జునను యాంకర్ ఒక క్వశ్చన్ అడుగుతుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఏం చేయాలో ఒక సలహా చెప్పండి అని అడగగా.. ఫోన్ తీసి పక్కన పెట్టండి.. అని చెబుతాడు. అదేంటి ఫోన్ తోనే అభివృద్ధి అని అనుకున్నప్పుడు పక్కకు పెడితే ఎలా? అని కొందరికి సందేహం రావచ్చు.
నాగార్జున చెప్పిన దాంట్లో విషయం దాగి ఉంది. ఎందుకంటే మొబైల్ ద్వారా అభివృద్ధి చెందిన మాట వాస్తవమే. కానీ దీనిని చాలామంది తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. మొబైల్ తో కాలక్షేపం చేస్తున్నారు.. మొబైల్ తో మంచి విషయాలు నేర్చుకునే బదులు చెడు విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.. మొబైల్ ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవడానికి బదులు షార్ట్స్ వీడియోలు చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు.. అంటే పనికిరాని వీడియోలు చూస్తూ సమయాన్ని వృధా చేసిన తర్వాత.. అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? అనేది నాగర్జున కాన్సెప్ట్.
Also Read:ధనవంతులు అవ్వాలంటే ఈ మైండ్‌సెట్ మార్చుకోవాలి!
దీని బట్టి చూస్తే చాలామంది నేటి యువత మొబైల్తో సమయాన్ని వృధా చేస్తున్నారు. మొబైల్ ద్వారా జీవితాన్ని నిలబెట్టుకోవచ్చు. కానీ ఏవేవో వీడియోలు చూస్తూ.. తమకు సంబంధం లేని పనులు చేస్తూ.. కాలం గడుపుతున్నారు. తీరా డబ్బు అవసరమయ్యేసరికి అప్పులు చేస్తున్నారు.. అప్పులు ఎక్కువైపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. కొంతమంది ఇదే జీవితమని అనుకుంటున్నారు..
కానీ ఫోన్ తోనే ఎన్నో లాభాలు ఉన్నాయి.. షార్ట్స్ వీడియోలు చూసే బదులు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటే ఏదో రకంగా డబ్బు సంపాదించవచ్చు. మొబైల్ లో సినిమాలు చూసే బదులు కొత్త విషయం తెలుసుకుంటే జ్ఞానం అన్న వస్తుంది. కానీ చాలామంది యువతల చేయడం లేదు.
ఇప్పటికైనా కొంతమంది యువకులు తేరుకొని నాగార్జున గారు చెప్పినట్లు అనవసర విషయాలకు మొబైల్ ను పక్కన పెట్టి.. కేవలం చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన అవసరానికి మాత్రమే మొబైల్ ను వాడే అలవాటు చేసుకుంటే జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుందని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. మరి అలా ఎంతమంది చేస్తారో చూద్దాం..