Investment Planning: కొత్త ఉద్యోగం రాగానే ప్రతి ఒక్క వ్యక్తి చేసే మొదటి పని ఇల్లు కొనుక్కోవడం. నెలనెలా జీతం వస్తుంది కనుక ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చు అని అనుకుంటారు. కానీ చాలామంది ఇల్లు గురించి ఆలోచిస్తారు.. ఖర్చు అయ్యే డబ్బు గురించి ఎవరూ లెక్క చేయరు. వాస్తవానికి కొత్త ఉద్యోగం రాగానే కొత్త ఇల్లు కొనుక్కోవడం కంటే కొన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా అలాంటి ఇండ్లు నాలుగు కొనుగోలు చేసే శక్తి వస్తుంది. అయితే ఆ శక్తి రావాలంటే ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి? ఇలా ప్లాన్ చేసుకోవాలి?
Also Read: వీఎస్ అచ్యుతానందన్ జీవితం.. ఒక పోరాట యోధుడి ప్రస్థానం!
నేటి కాలంలో చాలామంది ఇల్లును ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో జాబ్ రాగానే తమకు ఆదాయం ఉన్నా లేకున్నా అప్పుచేసి లేదా బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు కట్టేస్తున్నారు. అప్పు తీసుకున్న తర్వాత ఆ డబ్బు ఉన్నంత సేపు ఎలాంటి కష్టం ఉండదు. అంతేకాకుండా ఒకటి రెండు ఈఎంఐలు పే చేసేదాకా ఎలాంటి కష్టం అనిపించదు. కానీ రెండు సంవత్సరాల తర్వాత భారం ప్రారంభం అవుతుంది. అప్పుడు ఈఎంఐ ఎప్పుడూ పూర్తవుతుందా? అన్నా బాధ కలుగుతుంది. కానీ ఇప్పుడు బాధపడే బదలు ముందే కాస్త ఓపికతో ఆలోచించి ఉంటే డబ్బుకు డబ్బు ఉండి.. ఎలాంటి అప్పు లేకుండా ఇల్లు కూడా వచ్చే మార్గం ఉంటుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తికి లక్ష రూపాయల జీతంతో కొత్త ఉద్యోగంలో చేరాడు. ఆ వ్యక్తి హైదరాబాదులో అయితే కోటి రూపాయలతో ఇల్లును కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ తదితర ఖర్చులతో కోటి 20 లక్షల రూపాయల ఖర్చు అయితే అవుతుంది. 20 లక్షల రూపాయలు చేతిలో ఉన్నా.. కోటి రూపాయలను బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే దీనికి లక్ష రూపాయల జీతం నుంచి రూ. 30 వేల ఈఎంఐ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా 20 సంవత్సరాల వరకు టెన్యూర్ ఏర్పాటు చేసుకుంటే.. 80 నుంచి 90 లక్షల వరకు చెల్లిస్తారు. అప్పుడు కొన్న ఇల్లు కూడా సగం వరకు పాతబడిపోతుంది. మళ్లీ రీసైల్ చేసిన అంతే ధర వచ్చే అవకాశం ఉండదు.
Also Read: పదేళ్ల బాలుడి దేశభక్తి స్ఫూర్తి.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సాహసం!
అలాకాకుండా అద్దె ఇంట్లో ఉంటూ కొన్ని రకాల పెట్టుబడులు పెట్టడం వల్ల 20 సంవత్సరాల తర్వాత ఇల్లు తో పాటు.. డబ్బు కూడా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు లక్ష రూపాయల జీతం వచ్చే ఒక ఉద్యోగి తన జీవితంలో నుంచి రూ. 30 నుంచి 40 వేలు ఇట్టి అద్దెతో పాటు సొంత ఖర్చులు, మినహాయించి.. మిగతా 60000 simple investment plan లో ఈ 20 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయడం వల్ల కనీసం ఐదు కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ఇప్పుడు ఉన్న ధరలు అప్పుడు ఉండవు కదా అని కొందరు అనవచ్చు. మహా అంటే ఇల్లు ధర కోటి నుంచి మూడు కోట్ల వరకు లేదా నాలుగు కోట్ల వరకు పెరుగుతుంది. కానీ ఎస్ఐపి ద్వారా ఆవరేజ్ గానే ఐదు కోట్ల వరకు రాబడి ఉంటుంది. అంటే ఇందులో కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వచ్చిన దాంట్లో మూడు నుంచి నాలుగు కోట్ల తో ఇల్లు కట్టుకొని లేదా కొనుక్కొని.. మిగతా డబ్బును సొంతానికి వాడుకొని అవకాశం ఉంటుంది. ఇలా ఫైనాన్స్ ప్లాన్ చేయడం వల్ల ఎన్నో రకాలుగా లాభాలు పొందుతారు.