Health Tips : చాలా మంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఏదైనా అనారోగ్య వస్తే ముందుగానే మనకి కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఉదాహరణకు మీకు ఏదైనా జ్వరం వస్తే.. బాడీ వేడిగా కావడం, కళ్లు మంట, నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరికి కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. కానీ వాటిని గుర్తించలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అయితే ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఎలాంటి లక్షణాలు ముందుగా కనిపిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పక్షవాతం
పక్షవాతం వచ్చే ముందు కొందరి బాడీలో కొన్ని లక్షణలు కనిపిస్తాయి. ఒక్కసారిగా ముఖం, కాలు, చేయి మొద్దుబారినట్లు అనిపించడం, శరీరం బలహీనంగా అనిపిస్తుంది. అలాగే మీకు తెలియకుండానే మాట తడబడటం, అంతా కూడా అయోమయంగా అనిపించడం, ఇతరులు చెప్పేది ఏదీ అర్థం కాకపోవడం, చూపు తగ్గడం, నడవకలేకపోవడం, తల తిరుగుతున్నట్లు అనిపించి ఒక్కసారిగా కళ్లు తిరిగిపడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏ పనిచేయకపోయిన కూడా తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ లక్షణాలు మనకి ముందుగానే సంకేతాలను ఇస్తాయి.
గుండె పోటు
ఈ రోజుల్లో చాలా మంది అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి మృతి చెందుతున్నారు. గుండె పోటు వచ్చే ముందు ఛాతీలో నొప్పి, ఎడమ చేయి, భుజం, మెడ, దవడ అన్ని కూడా నొప్పిగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారంగా అనిపించడం, వాంతులు, చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరిలో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయని చెప్పలేం.
క్యాన్సర్
ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మీకు తెలియకుండానే ఒక్కసారిగా బరువు తగ్గడం, ఆకలి పూర్తిగా మందగించడం, తినేటప్పుడు ఇబ్బందిగా ఉండటం, కడుపు నిండుగా అనిపించడం, విశ్రాంతి లేక నీరసంగా అనిపించడం, తలనొప్పి, వెన్ను నొప్పి, మలబద్ధకం, అతిసారం, మూత్రం వెళ్లేటప్పుడు నొప్పి, నోటిలో ఇన్ఫెక్షన్, జననాంగాల్లో ఇన్ఫెక్షన్, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కొందరికి రొమ్ములో మార్పులు, నొప్పి, చనుమొనల నుంచి రక్తం కారడం, గొంతు మారిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
మానసిక సమస్యలు
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా మంచిది. ఈ సమస్య వచ్చే ముందు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి, నోరు పొడిబారడం, గుండె నొప్పి, ఛాతీలో నొప్పి, తీవ్ర అలసట, జలుబు, మతిమరుపు, ఆకలి తగ్గడం, జంక్ ఫుడ్ అతిగా తినడం, స్వీట్ తినాలనిపించడం, ఆందోళన, పని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని మనం ముందు గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. లేకపోతే సమస్య తీవ్రమయ్యి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.