Credit Card Offers: భారత్ లో డిజిటల్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఈరోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఈ సమయంలో కొందరు వినియోగదారుల చెల్లింపులను బేరీజు చేసుకొని బ్యాంకులు వారిని గుడ్ కస్టమర్లుగా గుర్తిస్తున్నాయి. ఇలాంటి వారికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వారి గృహ అవసరాలు, ఇతర వస్తుసేవలను ఉపయోగించుకోవడానికి కొంత ముందస్తు రుణం ఇచ్చేందుకు క్రెడిట్ కార్డ్స్ జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు డెబిట్ కార్డు ఇవ్వాలంటే సవాలక్ష నిబంధనలు ఉండేవి. కానీ ఇప్పుడు కొన్ని పరిమితులతో సామాన్యులకు సైతం క్రెడిట్ కార్డ్స్ అందిస్తున్నాయి. అయితే ఈ క్రెడిట్ కార్డ్స్ తో కేవలం వస్తు సేవలను మాత్రమే ఉపయోగించుకోకుండా.. ఇతర ఆఫర్లను పొందవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
క్రెడిట్ కార్డుల జారీ చేసిన వాటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) ముందు వరుసలో ఉంది. గ్రామాల్లోని వారు సైతం ఎస్బీఐ కార్డును కలిగి ఉన్నారనే చెప్పవచ్చు. అయితే కొంత మందికి క్రెడిట్ కార్డు ఉన్నా.. దానిని ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన లేదు. లేటేస్టుగా కొన్ని సంస్థలు ఎస్బీఐ కార్డుపైన మాత్రమే డిస్కౌంట్లు ఆఫర్లు చేస్తున్నాయి. మొబైల్ నుంచి స్మార్ట్ టీవీ వరకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు రూ.10వేల వరకు రిటర్ట్స్ పొందవచ్చు.
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో ఫోన్ వినియోగదారులు చాలా మందే ఉన్నారు. ఈ కంపెనీ నుంచి కొత్త మోడల్ రిలీజ్ అయిన వెంటనే సొంతం చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఒప్పో మొబైల్ ను క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఇలా మరికొన్ని మొబైల్స్ కూడా ఒకే కార్డుపై కొనుగోలు చేయొచ్చు. ఇలా రూ.5 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ డీల్ జూన్ 30 వరకు మాత్రమే ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
మరో కంపెనీ వివో కూడా స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో ముందంజలో ఉంది. ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి వివో ఫోన్ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ.6 వేల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవే కాకుండా షావోమి స్మార్ట్ ఫోన్స్ రూ.8 వేల వరకు రిటర్న్ వస్తాయి. ఈ ఆఫర్ జూలై 7 వరకు మాత్రమే ఉంటుందని కంపెనీ తెలిపింది. మొబైల్ అవసరమున్నవారికి కార్డ్స్ లేకపోయినా స్నేహితులు, ఇతరుల కార్డులను ఉపయోగించి ఈ ఆఫర్ ను సొంతం చేసుకోవచ్చు. మరో విషయమేంటంటే ఇవి ఈఎంఐ ట్రాన్షాక్షన్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.