https://oktelugu.com/

Parugu Movie: ‘పరుగు’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ ఇప్పుడెలా ఉందో చూడండి..

‘పరుగు’ సినిమా లో హీరోయిన్ ఫ్రెండ్ కోసం బొమ్మరిల్లు భాస్కర్ అమ్మాయిలను వెతికాడు. కానీ ఎవరూ సెట్ కాలేదు. దీంతో అప్పటికే యాంకర్ గా గుర్తింపు పొందిన చిత్రలేఖ అయితే బాగుంటుంది అని అనుకున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 19, 2023 / 08:48 AM IST

    Parugu Movie

    Follow us on

    Parugu Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు ఓ రేంజ్ లో ఉంటాయి. సినిమా సంగతి ఎలా ఉన్నా ఆయన యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతారు. దీంతో ఆయన సినిమాలు ఎంతో కొంత వసూలవుతాయనే నమ్మకం చాలా మంది నిర్మాతల్లో ఉంటుంది. దీంతో ఆయనను నమ్ముకునే సినిమాలు తీస్తారన్న టాక్ ఇండస్ట్రీలో ఉంటుంది. అల్లు అర్జున్ సోలో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న మాస్ మూవీ ‘పరుగు’. ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు. యూత్ ను ఆకర్షించే లవ్ స్టోరీ అయిన ‘పరుగు’ 2008లో రిలీజై ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇందులో ఉన్న స్టార్లందరికీ గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన యాక్టర్ పేరు చిత్రలేఖ. హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ఈమె ఆడియన్స్ నుంచి స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది.

    ‘పరుగు’ సినిమా లో హీరోయిన్ ఫ్రెండ్ కోసం బొమ్మరిల్లు భాస్కర్ అమ్మాయిలను వెతికాడు. కానీ ఎవరూ సెట్ కాలేదు. దీంతో అప్పటికే యాంకర్ గా గుర్తింపు పొందిన చిత్రలేఖ అయితే బాగుంటుంది అని అనుకున్నారు. చిత్రలేక మా టీవీలో ప్రసారమయ్యే ‘మా ఊరి వంట’ అనే కార్యక్రమంలో కనిపించి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇందులో ఆమె 2200 ఎపిసోడ్ల షోల్లో పాల్గొంది. ఆ తరువాత సినిమా ఫంక్షన్లు, స్పెషల్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. అప్పటికే యాంకర్ గా ఉన్న సుమకు పోటీగా చిత్రలేఖ తన మాటలతో అందరినీ ఆకట్టుకునేవారు.

    అయితే కొన్ని సినిమాల్లో చిత్రలేఖ కు అవకాశం వచ్చినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ అల్లు అర్జున్ ‘పరుగు’సినిమాతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో అవకాశం వచ్చినా గుర్తింపు రాలేదు. దీంతో సినిమాలు మానుకొని ఆమె పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను మెయింటేన్ చేసింది. అయితే చాలా కాలం తరువాత తిరిగి యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. కొన్ని టీవీ ఛానెళ్లల్లో ఆమె వ్యాఖ్యాతగా ఆకట్టుకుంటున్నారు.

    లేటేస్టుగా చిత్రలేఖ ఫొటోలు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమె అప్పటి కంటే ఇప్పుడే అందంగా తయారయ్యారు. అయితే చిత్రలేఖ పనిచేసే ప్రోగ్రామ్స్ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో మరోసారి ఆమె పాపులారిటీ కావడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఆమె లేటేస్ట్ పిక్స్ చూపి షాక్ అవుతున్నారు. ఇంత అందంగా ఎలా తయారయ్యారు? అని కామెంట్స్ పెడుతున్నారు.