Saving Schemes: డబ్బు జీవితాన్ని నడిపిస్తుందని కొన్ని సినిమాల్లో డైలాగ్స్ వినే ఉంటాం.. కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం అని తెలుస్తోంది. ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో ఎప్పుడు? ఎలాంటి అవసరాలు వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో ఇప్పటి జీవితాన్ని కొనసాగించడంతో పాటు భవిష్యత్ అవసరాల కోసం ఎంతో కొంత డబ్బు కూడబెట్టుకోవాలి. ముఖ్యంగా పిల్లల భవిష్యత్ కోసం వివిధ మార్గాల ద్వారా పెట్టుబడులు పెట్టకపోతే వారు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొన్ని ఆర్థిక పథకాలు ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ చేసేవారిని ఆకర్షిస్తున్నాయి. ఎక్కువ వడ్డీతో పాటు సెక్యూరిటీని అందించే ఈ పథకాల్లో డబ్బును పెట్టుబడులుగా పెడితే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఆ పథకాల గురించి తెలుసుకుందామా..
ఆడపిల్ల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడానికి ‘సుకన్య సమృద్ధి పథకం’ ఉంది. మరి మొగపిల్లల భవిష్యత్ కోసం ఎలాంటి పథకాలు లేవా? అని చాల మందికి డౌట్ ఉండే ఉంటుంది. ఈ క్రమంలో కేవలం మొగపిల్లల కోసం కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మంది అవగాహన లేకపోవడంతో చాలా మంది వాటిలో ఇన్వెస్ట్ చేయడం లేదు. వీటిలో ప్రధానమైనవి..
కిసాన్ వికాస్ యోజన పథకం:
పోస్టాఫీస్ ఆధ్వర్యంలో 1998లోనే ఈ పథకం ప్రారంభమైంది. ఇందులో కనీసం రూ.1000 వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. ఏడాదికి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 10 సంవత్సరాల వరకు ఏడాది పెట్టుబడులు పెట్టుకుంటే పోతే 7.9 శాతం వడ్డీని అందిస్తారు. ఇది పిల్లలపేరిట ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 18 సంవత్సరాల వయసు వచ్చిన వారు దీనికి అర్హులు. అయితే మొగపిల్లలు చిన్న వయసులో ఉండగా వారి పేరిట తల్లిదండ్రులు సంరక్షకులుగా ఉండి పెట్టుబడులు పెట్టవచ్చు.
పోస్టాఫీసు మంథ్లీ ఇన్ కం ప్లాన్:
కేవలం మగపిల్లల కోసం మాత్రమే ప్రవేశపెట్టిన స్కీం ఇది. ఇందులో కనీసం రూ.1000 నుంచి రూ.4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. దీనికి 7.6 శాతం వడ్డీని అందిస్తున్నారు. గరిష్టంగా 5 సంవత్సరాల వరకు మచ్యూరిటీని పెట్టుకోవచ్చు. దీనికి టీడీఎస్ వర్తించదు. అయితే సెక్షన్ 18 సి కింద ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్:
ఈ పథకంలో చిన్న ఆదాయానికి చెందిన వారి నుంచి ఉన్నత వర్గానికి చెందిన వారు కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తోంది. 18 సంవ్సరాల లోపు వయసున్న మొగపిల్లల తల్లిదండ్రులు వారి పేరిట అకౌంట్ తీసి ఫిక్స్ డ్ డిపాజిట్ చేయొచ్చు. ఇందులో రూ.1000 నుంచి అపరిమితొంగా ఇన్వెస్ట్ మెంట్ చేసుకోవచ్చు. 5 సంవ్సరాల పాటు మెచ్యూరిటీ ఉన్న దీనికి 7.7 శాతం వడ్డీని అందిస్తున్నారు.
రికరింగ్ డిపాజిట్ :
ఇందులో సాధారణ సేవింగ్స్ చేసినా కొంత మొత్తంలో వడ్డీని చెల్లిస్తారు. మూడు నెలల పాటు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 5 సంవ్సరాల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ను నిర్ణయించారు. అయితే మిగతా సేవింగ్స్ తో పోలిస్తే తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. అయితే 5.8 వరకు చెల్లిస్తారు. సేవింగ్స్ ఖాతాలో ఉండే డబ్బును ఈ స్కీంకు బదిలీ చేసుకోవచ్చు.