India Alliance : ఇండీ కూటమిలో ఇప్పటికే బయటపడిన లుకలుకలు

ఇండీ కూటమిలో ఇప్పటికే బయటపడిన లుకలుకలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: Neelambaram, Updated On : October 21, 2023 5:16 pm

India Alliance : కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎక్కడ? ఏమైంది? పేపర్లలో కనపడడం లేదు. టీవీల్లో వినపడడం లేదు. ఆర్భాటంగా మొదలుపెట్టి ఇప్పుడు అంతా చల్లబడ్డ పరిస్థితి నెలకొంది. మోడీ వ్యతిరేకులందరూ కూడా ఎంతో ఆశగా ఇండియా కూటమిమీద పెట్టుకున్న ఆశలు నిరాశ అవుతున్నాయి.

నెలరోజుల నుంచి ఏ పార్టీ మీటింగ్ లు ఆ పార్టీనే పెట్టుకుంటున్నాయి. పార్టీల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. నిన్నటికి నిన్న అఖిలేష్ యాదవ్ అసలు కాంగ్రెస్ ఇటువంటిది అని తెలియదు.. ఇంత చోర్ పార్టీ అని తెలియదు అని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ లో తమకు 6 సీట్లు ఇస్తామని అఖిలేష్ యాదవ్ కు కాంగ్రెస్ మొదట ప్రకటించింది. సమాజ్ వాదీకి కేవలం 1 సీటు మాత్రమే ఇస్తానని తర్వాత కాంగ్రెస్ షాకిచ్చింది.

దీంతో కాంగ్రెస్ ను తిడుతూ యూపీ బార్డర్ లోని 18 స్థానాల్లో తమ సమాజ్ వాదీ అభ్యర్థులను ప్రకటించాడు. యూపీలో ఒక్క సీటు ఇవ్వను అంటూ ఇక కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్నాడు అఖిలేష్ యాదవ్.

ఇండీ కూటమిలో ఇప్పటికే బయటపడిన లుకలుకలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.