Bhagavanth Kesari Collections: భగవంత్ కేసరి 2 డేస్ కలెక్షన్స్… హిట్ కొట్టాలంటే ఇంకా అన్ని కోట్లు రావాలి!

భగవంత్ కేసరి వసూళ్లు మాత్రం టాక్ రేంజ్ లో లేవు. పండగ దినాల్లో కూడా సంచలనం చేయలేకపోతోంది. అందులోనూ పోటీగా ఉన్న లియో, టైగర్ నాగేశ్వరరావు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి.

Written By: NARESH, Updated On : October 21, 2023 3:55 pm

Bhagavanth Kesari Collections

Follow us on

Bhagavanth Kesari Collections: భగవంత్ కేసరి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నాయి. దసరా కానుకగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి అక్టోబర్ 19న విడుదలైంది. బాలకృష్ణ గత చిత్రాలకు భిన్నంగా భగవంత్ కేసరి ఉంది. ఫాదర్-డాటర్ సెంటిమెంట్ పాళ్ళు సినిమాలో కొంచెం ఎక్కువగానే ఉంది. చనిపోయిన జైలర్ కూతురికి అన్నీ తానై పెంచే వ్యక్తి రోల్ చేశాడు బాలకృష్ణ.

భగవంత్ కేసరి వసూళ్లు మాత్రం టాక్ రేంజ్ లో లేవు. పండగ దినాల్లో కూడా సంచలనం చేయలేకపోతోంది. అందులోనూ పోటీగా ఉన్న లియో, టైగర్ నాగేశ్వరరావు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ రెండు చిత్రాల వసూళ్ల కంటే భగవంత్ కేసరి వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. అయితే ఇంకా జోరు చూపించాల్సి ఉంది. వరల్డ్ వైడ్ భగవంత్ కేసరి రెండు రోజుల వసూళ్లు పరిశీలిస్తే… నైజాంలో రూ.5.6 కోట్లు రాబట్టింది. సీడెడ్ రూ. 4.5 కోట్లు వసూలు చేసింది. ఉత్తరాంధ్ర రూ.1.66 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఏపీ/తెలంగాణాలలో రెండు రోజులకు భగవంత్ కేసరి రూ. 19.33 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ రూ. 3.75 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ.1.25 కోట్లు రాబట్టింది . వరల్డ్ వైడ్ రూ.24.33 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రెండ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. భగవంత్ కేసరి తెలుగు రాష్ట్రాల్లో రూ. 55 కోట్లు, వరల్డ్ వైడ్ రూ. 66 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. రూ. 67 కోట్లు భగవంత్ కేసరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఉంది.

భగవంత్ కేసరి చిత్రంలో బాలకృష్ణకు జంటగా కాజల్ నటించింది. అయితే ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. బాలయ్య-శ్రీలీల ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. శరత్ కుమార్ కీలక రోల్ చేశాడు. థమన్ సంగీతం అందించారు.

ఏరియాల వారీగా భగవంత్ కేసరి రెండు రోజుల వసూల్ వివరాలు…

నైజాం – 5.6 కోట్లు
సీడెడ్ – 4.5 కోట్లు [హైర్‌లతో సహా]
ఉత్తరాంధ్ర – 1.66 కోట్లు
తూర్పు – 1.13 కోట్లు
వెస్ట్ – 1.15 కోట్లు
గుంటూరు – 3.31 కోట్లు
కృష్ణ – 1.13 కోట్లు
నెల్లూరు – 0.85 కోట్లు

AP/TG : 19.33 కోట్లు
ROI: 1.25 కోట్లు
ఓవర్సీస్ : 3.75 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా: 24.33 కోట్లు(జీఎస్టీతో కలిపి)