Relationship: బంధాన్ని కాపాడుకోవాలా? నిజమైన ఆత్మ బంధువులు ఎవరు?

బంధం ఒక పుస్తకం. రాయడానికి సంవత్సరం పడుతుంది. కానీ కాల్చడానికి సెకను చాలు కాలి బూడిద అవుతుంది. అందుకే బంధాన్ని అయినా స్నేహాన్ని అయినా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే.

Written By: Swathi Chilukuri, Updated On : April 16, 2024 4:18 pm

Relationship

Follow us on

Relationship: బంధం బలపడాలన్నా, బలహీనపడాలన్నా మీ చేతిలోనే ఉంటుంది. మాట మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు. అందుకే మీ నోట్లో నుంచి జారే ప్రతి మాట ఇతరులు మీతో ఉండాలా? వద్దా అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఉన్నది ఒకటే జిందగీ స్నేహమైన, శత్రుత్వమైన ఈ జన్మలోనే చేయాలి. అందుకే ఉన్నన్ని రోజులు సంతోషంగా గడిపి వెళ్లాలి. గొడవలు, కోపాలు ఎందుకు ఫ్రెండ్స్. మరి ఈ బంధం గురించి ఈ రోజు కాస్త మాట్లాడుకుందామా..

బంధం ఒక పుస్తకం. రాయడానికి సంవత్సరం పడుతుంది. కానీ కాల్చడానికి సెకను చాలు కాలి బూడిద అవుతుంది. అందుకే బంధాన్ని అయినా స్నేహాన్ని అయినా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే. కొన్ని బంధాలు పలకరింపు వరకే ఆగిపోతే మరికొన్ని మాత్రం మనసుతో ముడి వేసుకుంటాయి. ఇలాంటి బంధాలను జీవితాంతం కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. కష్టం వస్తే చెప్పుకోవడానికి మనవారు అంటూ ఉండాలి కదా. ఈ బంధాలు మనసులకు సంబంధించినవి. అంతేగాని ఆస్తి, అంతస్థులను చూసి రాకూడదు.

ఆస్తి, అంతస్థుల వల్ల వచ్చే బంధాలు ఎల్లకాలం నిలవలేవు. వాటి వల్ల స్నేహం, బంధం పెరగలేదు. డబ్బు ఉన్నంత వరకు మాత్రమే ఈ బంధాలు ఉంటాయి. అందుకే బంధాలను గాజు బొమ్మ మాదిరి చూడాలి. ఇక ఈ బంధాలు తెగిపోతే కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. తప్పు ఎవరి వైపు ఉన్నా క్షమించే గుణం ఉండాలి. మనసు మంచిది అయితే చిన్న చిన్న గొడవలకు ఆ బంధాన్ని దూరం చేసుకోకండి. నలుగురు లేని జీవితం వృధా అని గుర్తు పెట్టుకోండి. నాది అనుకుంటే బంధం మీది. నాకెందుకు అనుకుంటే బరువు.

చిన్ననాటి అనుబంధాలు, రక్త సంబంధాలు ఎంతో విలువైనవి. ఆ బంధం ఉన్నప్పుడే విలువ తెలుసుకొని నడుచుకోవాలి. ఈ బంధాలు దూరం అయితే మళ్లీ దగ్గర అవ్వడం కష్టమే. ఇక డబ్బు ఉంటేనే కొందరు మీ దగ్గరకు వస్తారు. లేదంటే మిమ్మల్ని పట్టించుకోరు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది. మీ వద్ద ఏది లేనప్పుడు ఎవరైతే మీతో స్నేహం చేశారో వారే మీ నిజమైన ఆత్మ బంధువులు అని గుర్తు పెట్టుకోండి.