https://oktelugu.com/

Glenn Maxwell: ఐపీఎల్ నుంచి వైదొలిగి షాక్ ఇచ్చిన మ్యాక్స్ వెల్.. కారణం అదే

బెంగళూరు జట్టు మరుసటి మ్యాచ్ కోసం తుది జట్టును ఎంపిక చేస్తున్న నేపథ్యంలో కెప్టెన్ డూ ప్లెసిస్ కు మాక్స్ వెల్ ఈ విషయం చెప్పాడు. ప్లేయింగ్ - 11 లోకి తన బదులు మరొక ఆటగాడిని తీసుకోవాలని కోరాడు.

Written By: , Updated On : April 16, 2024 / 04:09 PM IST
Glenn Maxwell

Glenn Maxwell

Follow us on

Glenn Maxwell: ఇప్పటికే వరుస పరాజయాలు.. జట్టును అమ్మేయండి అంటూ దిగ్గజ ఆటగాళ్ల నుంచి విమర్శలు.. ఇక సోషల్ మీడియాలో అభిమానుల ట్రోలింగ్స్ కు అయితే లెక్కలేదు. అయినప్పటికీ బెంగళూరు జట్టు తన ఆట తీరు మార్చుకోవడం లేదు. పైగా అత్యంత నాసిరకంగా బౌలింగ్ వేస్తూ పరువు తీసుకుంటోంది. సోమవారం రాత్రి హైదరాబాద్ జట్టు జరిగిన మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు గల్లి స్థాయి బౌలింగ్ వేశారు. ఫలితంగా హైదరాబాద్ జట్టు 287 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన బెంగళూరు జట్టు 262 పరుగులు చేసి 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.. ఈ గెలుపుతో హైదరాబాద్ జట్టు వరుసగా మూడవ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

అటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్ భాగంలో దారుణంగా విఫలమవుతున్న బెంగళూరు జట్టు బ్యాటింగ్ విభాగంలోనూ కొంతమంది మీదే ఆధారపడుతోంది. అయితే ఈ జట్టు లో మాక్స్ వెల్ ఇలాంటి ఆటగాడు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటివరకు అతడు తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. కోట్లు పెట్టి కొనుగోలు చేయడంతో బెంగళూరు యాజమాన్యం అతడిని బలవంతంగా కొనసాగించాల్సి వచ్చింది. అయినప్పటికీ వచ్చిన అవకాశాలను అతడు వినియోగించుకోలేదు. అయితే ఇటీవల మ్యాచ్ లో అతడి చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే సోమవారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఓడిపోయిన నేపథ్యంలో.. మాక్స్ వెల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు సంచలన ప్రకటన చేశాడు.

బెంగళూరు జట్టు మరుసటి మ్యాచ్ కోసం తుది జట్టును ఎంపిక చేస్తున్న నేపథ్యంలో కెప్టెన్ డూ ప్లెసిస్ కు మాక్స్ వెల్ ఈ విషయం చెప్పాడు. ప్లేయింగ్ – 11 లోకి తన బదులు మరొక ఆటగాడిని తీసుకోవాలని కోరాడు. ఎందుకంటే గత ఐదు మ్యాచ్ లలో మాక్స్ వెల్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కొన్నిసార్లు గోల్డెన్ డక్ గా కూడా వెను తిరిగాడు. తన ఫామ్ సరిగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాక్స్ వెల్ ప్రకటించాడు.. అయితే అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన బెంగళూరు ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. మరో ఏడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్ చేరాలి అంటే కచ్చితంగా ఐదు మ్యాచ్ల్లో బెంగళూరు గెలవాలి. అది కూడా భారీ రన్ రేట్ తేడాతో నెగ్గాలి. అప్పుడే ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి.