Goodness: కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతున్నారు. ఒకప్పుడు దానం, మంచితనం, గొప్ప మనసుతో ఉండేవారు ప్రజలు. కానీ ఇప్పుడు స్వార్థపూరితమైన మనసుతో కల్మషం అవుతున్నారు. తన, పర అనే బేధం లేకుండా కూడా ఇలాంటి ద్వేషపూరిత మైన బంధాలను కొనసాగిస్తున్నారు. కొందరు అయితే ఏకంగా తెలిసి కూడా ఇతరులకు హాని చేస్తున్నారు. కానీ మంచితనంతో ఉన్న వారు ఇప్పటికీ ఉన్నారు.
ఇలాంటి జనరేషన్ లో కూడా కొందరు తమకంటూ ఎలాంటి ఆదా చేసుకోకుండా మంచితనంతో ఉంటున్నారు. ఇతరులకు సహాయం చేయడమే వారి ధ్యేయం. ఇంట్లో వారి సంతోషమే వారికి ముఖ్యం. బయటి వారి బాగోగులు వారికి ప్రధానం అన్నట్టుగా ఉంటారు. మంచితనం అందరికీ ఆయుధం అయితే అతి మంచితనం మాత్రం కొందరికి శత్రుత్వం మాదిరి మారుతుంది. ఈ మంచితనం వల్లనే వారి జీవితం కూడా నాశనం అవుతుంటుంది. అయినా వారికి అర్థం కాదు. మంచితనం ఉండాలి కానీ మనకు చేటు చేసే అతిమంచితనం ఉండకూడదు అంటారు నిపుణులు.
ఎవరు కన్నీరు పెడితే నేను చూడలేను అంటూ ఉన్న భూమి, ఆస్తులు పంచిపెడితే చివరికి నాశనం అయ్యేది మీరే. అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, చుట్టాలు, ఇతరులు అంటూ అతి మంచితనం చూపిస్తే చివరకు మీ పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇతరులకు దానం చేయడం మంచిది అంటారు పెద్దలు. మీరు ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడటానికి ఎవరు రారు అని గుర్తుపెట్టుకోండి. అతి సర్వత్ర వర్జయేత్ అనే విషయం ఎల్లప్పుడు గుర్తుపెట్టుకొని జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి.
కర్ణుడు గొప్ప దాత. కానీ అడగగానే కవచకుండలాలు ఇవ్వడం అనేది మంచి విషయం అంటారు పెద్దలు. అందుకే అతి మంచితనం పనికిరాదని.. మన గురించి ఆలోచించిన తర్వాతనే ఇతరుల గురించి ఆలోచించాలి అంటారు. మరి మంచితనాన్ని అయితే మర్చిపోకండి.