Cool drink Bottles : చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరు కూడా కూల్ డ్రింక్స్ ని ఎక్కువగా తాగుతుంటారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదని తెలిసిన వీటినే ఎక్కువగా తాగుతుంటారు. ఇంటికి చుట్టాలు వచ్చిన, ఏదయినా పండగ ఉన్న, ఫంక్షన్ ఉన్న తప్పకుండా కూల్ డ్రింక్స్ వాడుతారు. అందులో వేసవి కాలం అయితే అసలు చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ డ్రింక్ బాటిల్స్ స్టాక్ ఉంటాయి. భోజనం తరువాత తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే బిర్యానీ తినేటప్పుడు ఏదో ఒక కూల్ డ్రింక్ లేకపోతే కొందరు అసలు తినకుండా ఉండరు. తప్పకుండా బిర్యానికి కూల్ డ్రింక్ ఉండాల్సిందే. అయితే ఈ కూల్ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిని కొన్ని రసాయనలతో తయారు చేస్తారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. డైట్ ఫాలో అయ్యే వాళ్లు అయితే వీటిని అసలు తాగరు. ఎక్కువగా వీటిని తాగడం వల్ల బరువు కూడా పెరుగుతారు. అయితే మీరు డ్రింక్ తాగేటప్పుడు ఎప్పుడైనా బాటిల్ ను గమనించారా. పెద్ద డ్రింక్ బాటిల్ లేదా చిన్న డ్రింక్ బాటిల్ అయిన కాస్త వెలితిగా ఉంటుంది. అసలు కూల్ డ్రింక్ బాటిల్స్ ఇలా వెలితిగా ఉండటానికి కారణం ఏంటో మరి తెలుసుకుందాం.
కూల్ డ్రింక్స్ ను ఇలా కాస్త ఖాళీగా నింపడానికి ఒక కారణం ఉంది. వీటిలో కార్బోనేటెడ్ వాటర్ ను కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ తో కలుపుతారు. సాధారణంగా కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఒత్తిడిని సృష్టిస్తుంది. కాబట్టి బాటిల్ నిండుగా నింపితే పగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే కంపెనీలు కాస్త వెలితిగా కూల్ డ్రింక్స్ ను నింపుతాయి. కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడి బాటిల్ మీద పడితే పగులతుందని.. అలా కాకుండా ఉండటానికి ఇలా చేస్తారు. ఇలా వదలడం వల్ల ఆ ఖాళీలో కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడి పడుతుంది. దీంతో బాటిల్ కి ఎలాంటి ప్రమాదం ఉండదు. డ్రింక్ కూడా బయటకు రాదు. అదే ఖాళీ లేకుండా మొత్తం నింపితే డ్రింక్ బయటకి వచేస్తుంది. అలాగే కూల్ డ్రింక్స్ టేస్ట్ పోకుండా ఉండటానికి కూడా ఇలా బాటిల్ ఖాళీ ఉంచుతారు. ఇలా చేయడం వల్ల కూల్ డ్రింక్స్ పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. కూల్ డ్రింక్ బాటిల్ ఇలా వెలితిగా ఉండటం మీరు ఎప్పుడైనా గమనించారా.. మీకు కూడా ఇదే డౌట్ వచ్చిందా అయితే కామెంట్ చేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. E విషయాన్ని గూగుల్ ఆధారంగా చెప్పడం జరిగింది. దీన్ని oktelugu.com