Zodiac Signs: శని తిరోగమనం వల్ల ఈ రాశుల వారికి అదిరిపోయే కాలం వచ్చేస్తోంది..

కుంభరాశి జాతకులకు కూడా ఈ శని తిరోగమనం వల్ల లబ్ది జరుగుతుంది. ఇప్పటినుంచి కుంభ రాశి వారికి తిరోగమనం నుంచి మంచి రోజులు మొదలయ్యాయి అంటున్నారు పండితులు . ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుందట.

Written By: Swathi Chilukuri, Updated On : June 7, 2024 5:48 pm

Zodiac Signs

Follow us on

Zodiac Signs: ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటే శని గ్రహానికి కూడా ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ గ్రహాన్ని అశుభ గ్రహంగా పరిగణిస్తారు. కానీ అన్ని గ్రహాల మాదిరి కాకుండా శని కర్మ ఫలాలను ఇచ్చే గ్రహంగా చెబుతారు పండితులు. జూన్ 29వ తేదీ రాత్రి 11 గంటల 40 నిమిషాలకు శని కుంభ రాశిలో శని తిరోగమనం చెందుతుందట. ఈ తిరోగమనం మొత్తం 139రోజుల పాటు ఉంటుంది. దీని వల్ల కొన్ని రాశులకు చాలా శుభ ఫలితాలు ఉంటాయని చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం.

దీని కారణంగా మేషరాశి వారికి లబ్ది కలుగుతుంది. శని తిరోగమనం వల్ల మేష రాశి జాతకులకు ఈ 139రోజుల పాటు కెరీర్ చాలా బాగుంటుంది. అంతేకాదు ఆర్థిక పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. జీవిత భాగస్వామితో సంబంధాలు చాలా బాగుంటాయి. వ్యాపారస్తులకు ఆరోగ్యకరమైన లాభాలు అందుతాయి. మీ పోటీదారులను ధీటుగా ఎదుర్కొంటారు.

కుంభరాశి జాతకులకు కూడా ఈ శని తిరోగమనం వల్ల లబ్ది జరుగుతుంది. ఇప్పటినుంచి కుంభ రాశి వారికి తిరోగమనం నుంచి మంచి రోజులు మొదలయ్యాయి అంటున్నారు పండితులు . ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుందట. అన్ని రంగాలలోనూ పురోగతిని, విజయాన్ని సాధిస్తుంటారు. ఈ రాజ యోగం కారణంగా కుంభ రాశి జాతకుల ఆదాయ వనరులు చాలా పెంచుకుంటారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. కష్టపడేవారికి మంచి ఫలితాలు అందుతాయి.

శని తిరోగమన కుంభరాశిలో ఉండటం వల్ల మిధున రాశి వారికి కూడా అదృష్టం లభిస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులకు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. వీరు సంతోషంగా జీవించడమే కాదు వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక లాభాలను గడిస్తారు. పోటీ పరీక్షలకు రెడీ అయ్యే వారికి శుభసూచకం. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తై ఆర్థిక లాభాలు చవిచూస్తారు.

తులారాశి జాతకులకు కూడా ఈ కాలం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం చాలా పెరుగుతుంది. ఏ వృత్తిలో ఉన్నా సరే విజయాలు సాధిస్తారు. వ్యాపారవేత్తలకు ఊహించని లాభాలు వస్తాయి. వీరు ఏ పని చేసినా సరే మంచి ఫలితాలను అందిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ సమయం అన్ని విధాల కలిసి వస్తుంది.