https://oktelugu.com/

Chiranjeevi : 34 ఏళ్ల తర్వాత చిరంజీవితో ఫోటో దిగిన టాప్ స్టార్స్.. ఈ పిక్ లో ఆ ఒక్కటి మిస్ అయ్యింది…

ఇక రిషి కూడా తెలుగు లో ఏ ఫిల్మ్ బై అరవింద్, భాగ్య లక్ష్మి బంపర్ డ్రా లాంటి సినిమాల్లో నటించాడు. ఇక తమిళ్, మలయాళం లో ఆయన ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు...

Written By:
  • NARESH
  • , Updated On : June 7, 2024 / 05:49 PM IST
    Follow us on

    Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీని 40 సంవత్సరాలుగా ఏలుతున్న ఒకే ఒక్కరు చిరంజీవి.. అయితే చిరంజీవి నటించిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించాయి. ముఖ్యంగా ఆయన హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అందులో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా మాత్రం సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డును కూడా బ్రేక్ చేసింది.

    అయితే ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించగా చిరంజీవితో పాటు ఒక నలుగురు చిన్న పిల్లలు కూడా ఇందులో నటించారు. ఇక అందులో బేబీ శాలిని, షామిలి, రిషి అనే పిల్లలు నటించారు. ఇక ఈ ముగ్గురు కూడా సొంత బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావడం విశేషం… ఇక రీసెంట్ గా చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు తమిళ్ సూపర్ స్టార్ అయిన అజిత్ ఆయన్ని కలిసి ఆయనతో ఒక ఫోటో దిగాడు. ఇక దాంతో అజిత్ భార్య అయిన షామిలి ఇంతకుముందు చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా టైంలో తను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినప్పుడు దిగిన ఫోటోని ఇప్పుడు రీసెంట్ గా దిగిన ఫోటోని మ్యాచ్ చేస్తూ తన ఇన్స్టాలో ఒక ఫోటో ను అయితే రిలీజ్ చేసింది.

    ఇక 34 సంవత్సరాల తర్వాత దిగిన ఫోటో అంటూ తను ట్యాగ్ చేయడం ఇప్పుడు చిరంజీవి అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే పాత ఫోటోలో శ్రీదేవి కూడా ఉంది కానీ ఇప్పుడు ఉన్న ఫోటోలో శ్రీదేవి మిస్సయింది. ఇక దాంతో శ్రీదేవి అభిమానులు సోషల్ మీడియాలో శ్రీదేవి గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే అతిలోకసుందరి అనుకోని రీతిలో చాలా తక్కువ ఏజ్ లోనే మరణించడం అనేది చాలా మందిని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం అనే చెప్పాలి.

    ఇక ఇప్పుడు ఆమె లేకపోవడం అనేది ఫోటోలో చాలా వెలితిగా కనిపిస్తుంది అంటూ మరికొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. ఒక మొత్తానికైతే శాలిని, షామిలి, రిచర్డ్ రిషి వీళ్ళు ముగ్గురు కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసినవారే కావడం విశేషం..షామిలి సఖి సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇక ఆ తర్వాత హీరో అజిత్ ను పెళ్లి చేసుకుంది. అలాగే షామిలి ఓయ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక రిషి కూడా తెలుగు లో ఏ ఫిల్మ్ బై అరవింద్, భాగ్య లక్ష్మి బంపర్ డ్రా లాంటి సినిమాల్లో నటించాడు. ఇక తమిళ్, మలయాళం లో ఆయన ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు…