Royal Enfield: బైక్ పై ఉత్సాహంగా డ్రైవ్ చేయాలనుకునే వారు కాస్త ఖరీదైన వాటిని కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా నేటి కాలపు యూత్ బైక్ ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ఆకర్షణీయమైన మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. యూత్ ఐకాన్ గా ఉంటున్న Royal Enfield కంపెనీ వారికి అనుగుణంగా ఇప్పటికే చాలా బైక్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని నుంచి కొత్తగా రాబోతున్న Royal Enfiled Himalayan 750 బైక్ గురించి ఇప్పటికే వివరాలు అందించింది. దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా లీక్ కావడంతో లగ్జరీ బైక్ ప్రియులు దీని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ బైక్ ఎలా ఉండబోతుందంటే?
Royal Enfield నుంచి కొత్త రాబోతున్న Himalayan 750 బైక్ ఇంజిన్ అప్ గ్రేడ్ అయింది. ఈ ఇంజిన్ ట్విన్ సిలిండర్ ను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న బైకుల్లో 650 సీసీ ఇంజిన్ ఉండేది. కానీ ఇందులో 750 సీసీ ని అమర్చారు. ఇది హై స్పీడ్ తో పాటు లాంగ్ జర్నీ చేసేవారికి ఎలాంటి అలసట లేకుండా చేస్తుంది. ఇందులో 47 బీహెచ్ పీ పవర్ తో పాటు 52 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేయనుంది. బేర్ 650 పై 56.5 ఎన్ ఎం పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ బైక్ లో కొత్తగా ఫ్రేమను అమర్చారు. ముందు 19 అంగుళాలు, వెనకాల 17 అంగుళాల వైర్ స్పోక్ వీలుపై ప్రయాణిస్తుంది. ఫ్రంట్ బ్రేకింగ్ సెటప్ లో ట్విన్ డిస్క్ లు అమర్చే అవకాశం ఉంది. ఇవి టూబ్ టైర్లుగా ఉండనున్నాయి. ముందు, వెనక ట్విన్ డిస్క్ లు అమర్చబడ్డాయి. ఇప్పటి వరకు ఉన్న సిగ్నేచర్, హిమాలయన్ సిల్హౌట్ లాగే ఉన్నప్పటికీ దీనిని ఎక్కువగా స్పోర్ట్స్ టూర్ కు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు. పొడవాటి విండ్ స్క్రీన్ తో పాటు భారీ భాష్ ప్లే ఇందులో అమర్చారు. అయితే పూర్తి డిజైన్ పాత బైక్ లాగే ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. కానీ యూత్ ను బాగా ఆకర్షిస్తుందని అంటున్నారు.
గతంలో ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన బైక్ ల కంటే ఇది భిన్నంగా ఉండనుంది. ఇందులో ఎల్ ఈడీ లైట్స్ స్లాట్ ఎక్కువగా ఉంటుంది. అయితే హియాలయన్ 450లో మాదిరిగానే అప్ స్వేప్ట్ టెయిల్ సెక్షన్ ను అమర్చారు. ఎర్గోనామిక్స్ హ్యాండిల్ తో రైడ్ చేయడం వల్ల బైక్ షేకింగ్ సమస్య ఉండదు. చాలా సందర్భాల్లో మట్టి ప్రదేశాల్లో ప్రయాణించినా.. టైర్లపై ఎలాంటి దుమ్ము ధూళి ఉండకుండా చేస్తాయి. టైర్లు సస్పెన్షన్ తో మైలు మంచర్ లాగా కనిపిస్తాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ హియాలయన్ ను త్వరలో పరీక్షించనున్నారు. ఆ తరువాత మిగతా పార్ట్స్ ను అమర్చి 2026లో మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ బైక్ కు సంబందించిన ఫొటోలుయూత్ ను బాగా ఆకర్షిస్తున్నాయి.