Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే. ఆయన దరఖాస్తు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై విచారణ నేడు జరగనుంది. ఆయన రెగ్యులర్ బెయిల్ లభిస్తుందా?, లేదా మళ్లీ జైలు కి వెళ్లే పరిస్థితి వస్తుందా అనేది కాసేపట్లో తెలియనుంది. పోలీసులు మాత్రం అల్లు అర్జున్ పై చాలా ఫైర్ మోడ్ లో ఉన్నారు. ఆయనకీ రెగ్యులర్ బెయిల్ ని రద్దు చేయించేందుకు తమ వంతు ప్రయత్నాలు గట్టిగానే చేసే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ ట్రయిల్ కోర్టు అయినటువంటి నాంపల్లి కోర్టు లో రెగ్యులర్ బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసులు కూడా బెయిల్ పిటీషన్ పై తమ కౌంటర్ పిటీషన్ ని దాఖలు చేసారు కానీ, అందులో అల్లు అర్జున్ కి బెయిల్ పిటీషన్ ఇవ్వడం లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
ఒకవేళ బెయిల్ ఇస్తే విచారణకి అవసరమైనప్పుడు అల్లు అర్జున్ హాజరు అయ్యేలా చూడాలని మాత్రమే కోరారు. దీంతో అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ వచ్చేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయి. అభిమానులు సంబరాలకు సిద్ధం అయిపోవచ్చు. రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత ఆయన శ్రీతేజ్ ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీ తేజ్ తండ్రి భార్గవ్ కూడా కేసు వెనక్కి తీసుకోవడానికి సిద్ధం గా ఉన్నాను అని మీడియా ముఖంగా అధికారికంగా చెప్పడంతో, అల్లు అర్జున్ ప్రభుత్వం అనుమతిని తీసుకొని శ్రీతేజ్ ని కలవొచ్చు. శ్రీతేజ్ ని ఆయన కలిసిన రోజు పెద్ద సెన్సేషన్ అవ్వుధి. ఇప్పటికే ఆ కుటుంబానికి పుష్ప టీం మొత్తం కలిసి రెండు కోట్ల రూపాయిల ఆర్ధికసాయం చేసారు. అదే విధంగా శ్రీ తేజ్ తండ్రికి సినీ ఇండస్ట్రీ లో తన అర్హతకు తగ్గ ఉద్యోగం ఇప్పిస్తానని నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు.
ఇలా ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు నెగటివ్ యాంగిల్ నుండి పాజిటివ్ యాంగిల్ వైపు వెళ్తుంది. మరోవైపు అల్లు అర్జున్ తన కొత్త సినిమా పనుల్లో కూడా బిజీ అవ్వబోతున్నారు. పుష్ప 2 తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన పొడవాటి జుట్టు, గుబురు గెడ్డం పెంచుతున్నాడు. ఇప్పటి వరకు అభిమానులు ఊహించని లుక్ లో ఆయన కనిపించబోతున్నాడు. సుమారు 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా జానర్ పీరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ తో ఒక సినిమా, అట్లీ తో మరో సినిమా చేయనున్నాడు. గత రెండు రోజుల నుండి కొరటాల శివ అల్లు అర్జున్ కి స్టోరీ న్యారేషన్ ఇస్తున్నాడట.