https://oktelugu.com/

Black Panther 3 : మల్టీవర్స్ గా రాబోతున్న బ్లాక్ పాంతర్ 3 లో విల్ స్మిత్ పోషించే పాత్ర అదేనా..?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కంటే కూడా హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది. వాళ్ళ నుంచి వచ్చే సినిమాలు యావత్ వరల్డ్ మొత్తాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి.

Written By:
  • Gopi
  • , Updated On : January 3, 2025 / 11:29 AM IST

    Black Panther 3

    Follow us on

    Black Panther 3 : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కంటే కూడా హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది. వాళ్ళ నుంచి వచ్చే సినిమాలు యావత్ వరల్డ్ మొత్తాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మల్టీవర్స్ గా వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వారిని హుక్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయి…

    ఇక హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా యావత్ ప్రపంచానికి చాలా ప్రత్యేకంగా నిలుస్తోందనే చెప్పాలి. ఇక అందులో భాగంగానే బ్లాక్ పాంథర్ రెండు పార్టు లు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు బ్లాక్ పాంథర్ 3 కూడా రాబోతుందనే విషయం ఒక్కసారిగా సినిమా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. సడన్ గా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ‘బ్లాక్ పాంథర్ 3’ ట్రైలర్ ని వదిలిన మేకర్స్ ఎందుకు అలా చేశారనే దానిమీద సరైన క్లారిటీ లేదు కానీ ఇది మేకర్స్ చేయలేదని అందులో నటించే ఒక నటుడు ఈ సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని లీక్ చేసినట్టుగా తెలుస్తోంది…

    ఇక మొదటి రెండు పార్టులకు దర్శకత్వం వహించిన ‘రైమ్ గుగ్లార్’ ఎంత మంచి డైరెక్టర్ అనేది ఇప్పటికే ఆయన చాలా సార్లు ప్రూవ్ చేశారు…ఇక మల్టీవర్స్ గా రానున్న ఈ సినిమా లో వఖండా కి సంబంధించి ‘కెప్టెన్ అమెరికా’ లానే ఇందులో ఉన్న సమ్ యొక్క సూట్ ను వాళ్లే తయారు చేశారు…ఇక ‘ఐస్ ఆఫ్ వకాండా’ నుంచి 4 ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి… ఇక ఇదిలా ఉంటే బ్లాక్ పాంథర్ 3 సినిమా 2025 ఎండింగ్ లో థియేటర్లోకి వచ్చే అవకాశమైతే ఉన్నట్టుగా తెలుస్తోంది…

    ఇక ఈ ట్రైలర్ ని కనక మనం చూసినట్లయితే ఇంతకుముందు వచ్చిన రెండు పార్టులను బీట్ చేసే విధంగా ఈ ట్రైలర్ అనేది ఉండడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ‘విల్ స్మిత్ ‘ ఈ ట్రైలర్ లో చాలా అద్భుతంగా కనిపించడమే కాకుండా మెయిన్ లీడ్ పాత్రను పోషించి వఖండా లో స్ట్రాంగ్ పర్సన్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక దర్శకుడు ఈ ట్రైలర్ ని విజువల్స్ పరంగా చూస్తే చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తో కూడిన ట్రైలర్ ను కట్ చేశాడనే చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ యావత్ వరల్డ్ మొత్తాన్ని ఆకట్టుకుంటుంది. విల్ స్మిత్ పోషించిన పాత్ర ఈ కథలో అంతర్లీనంగా సాగబోతున్నట్టుగా తెలుస్తోంది. మల్టీవర్స్ గా రాబోతున్న ఈ సినిమాలో మరిన్ని క్యారెక్టర్లు ఆడ్ కాబోతున్నాయనే సమాచారం అయితే అందుతుంది.

    మరి ఏది ఏమైనా కూడా బ్లాక్ పాంథర్ 3 సినిమా వస్తుందని తెలియజేసిన మేకర్స్ ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ లో మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేకపోయారు. మరి ఏది ఏమైనా కూడా బ్లాక్ పాంథర్ 3 సినిమా కోసం యావత్ వరల్డ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ట్రైలర్ లో నిజంగా విజువల్ ఫిస్ట్ కనిపించింది. దాంతో ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు…